ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచే క్రమంలో అనంతపురం రైల్వే స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రైలు ట్రాక్ పై కూర్చుని "ప్రత్యేక హోదా" నినాదాలు చేసారు. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం-హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య, సమన్వయకర్తలు నదీమ్ అహ్మద్, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కిష్టప్ప, సంయుక్త కార్యదర్శి శివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నగర అధ్యక్షుడు సోమశేకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.