YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

హాట్ టాపిక్ గా మారిన ఆదిరెడ్డి భవానీ

హాట్ టాపిక్ గా మారిన ఆదిరెడ్డి భవానీ

హాట్ టాపిక్ గా మారిన ఆదిరెడ్డి భవానీ
రాజమండ్రి, జూన్  20,
రాజ్య సభ ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని ఓటు చెల్లకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతుంది. అవగాహన లేకే టిక్ పెట్టి చెల్లని ఓటు వేసినట్లు భవాని పోలింగ్, కౌంటింగ్ పూర్తి అయ్యాక వెల్లడించారు. అయితే వైసిపి తో లోపాయికారి అవగాహన కుదిరే ఆదిరెడ్డి భవాని కావాలనే ఈ పని చేసి ఉంటారని అధికారపార్టీ లో విపక్ష పార్టీలో గుస గుసలు మొదలైపోయాయి. దాంతో త్వరలో ఎపి లో రాజకీయ పరిణామాలు మరింత వేగంగా మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో ముగ్గురు ఎమ్యెల్యే లు విపక్షం నుంచి గోడ దూకేస్తే మాత్రం టిడిపి అధినేతకు ప్రధాన విపక్ష హోదా గల్లంతు కానుంది.ఏపీ లో తొలి ఎమ్మోల్సీ గా వైఎస్ జగన్ గతంలో ఎంపిక చేసింది ఆదిరెడ్డి అప్పారావు ను. బలమైన బిసి నేతగా ఉండటంతో పాటు ఎర్రన్నాయుడు కుటుంబంతో బంధుత్వం ఉన్న అప్పారావు ను పార్టీలో సీనియర్లను సైతం కాదని జగన్ నాడు టిక్ పెట్టారు. అయితే వైసిపి ప్రతిపక్షంలో ఉండగానే అప్పారావు నాటి అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి దూకేశారు. ఆదిరెడ్డి భవాని కి స్వయంగా మామ గారైన అప్పారావు కు అటు టిడిపి, ఇటు వైసిపి లో కూడా సత్సంబంధాలే ఉన్నాయి. గతంలో ప్రతిపక్షంలోను ప్రస్తుతం టిడిపి లో ఉన్నా విపక్షంలో ఉన్న ఆదిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో నిలబడేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది.సేవా కార్యక్రమాలు కానీ, క్యాడర్ ను పోషించడంలోనూ వారిది రాజమండ్రిలో పై చెయ్యి అనే చెప్పాలి. అయితే దీర్ఘ కాలంగా విపక్ష పాత్ర పోషించడం అంటే కొవ్వొత్తి రాజకీయమే ఆదిరెడ్డి కుటుంబానిది అయిపొయింది. డబ్బుకు డబ్బు పోయింది అధికారపార్టీలో లేకపోవడంతో నియోజకవర్గంలో గౌరవం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఆఫర్ ను అందుకుని మరోసారి పార్టీ మారడమా లేక జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ లా విపక్ష పార్టీలో ఉంటూనే అధికారపార్టీకి సహకరించడమా ఇలా పలు రకాల అప్షన్ లు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఊరిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవలే అచ్చన్నాయుడు అరెస్ట్ తో జగన్ కి ఎదురు నిలిచి పోరాడితే కేసులు తప్ప మరేమి ఒరిగేదేమి లేదని టిడిపి లో మరో చర్చ నడుస్తుంది.వాస్తవానికి జగన్ అండ్ టీం పై కాంగ్రెస్ గతంలో కేసులు పెట్టిన వాటిలో టిడిపి నుంచి దివంగత ఎర్రన్నాయుడు కీలక పాత్ర పోషించారు. అయినా కానీ జగన్ అందరు అనుకున్నట్లు ఏమి మనసులో పెట్టుకోకుండా అచ్చెన్నను వైసిపి లోకి గతంలోనే రావాలని ఆహ్వానించారని చెబుతారు. అయితే ఆయన నో చెప్పి చంద్రబాబు తోనే ప్రయాణం చేసేందుకు నిర్ణయించుకున్నారు. బాబు సైతం శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు ఎర్రన్న కుటుంబానికి పార్టీ లో పలువురు వ్యతిరేకించినా అండగా నిలిచి రాజకీయంగా ఉన్నత అవకాశాలే ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఊగిసలాటలో ఉండటంతోనే అధికారపార్టీవైపు పూర్తి స్థాయిలో వెళ్లలేకపోతుందని కొందరు భావిస్తున్నారు.అయితే పలువురు విపక్ష పార్టీని వీడి అధికారపార్టీ వైపు చూస్తున్నారు. ఒక్కో ఎమ్యెల్యే జారిపోతున్నప్పుడల్లా మా కుటుంబం టిడిపి వైపే అని ఆదిరెడ్డి స్పష్టం చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇలాంటి స్థితి లో అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవాని చేసిన తప్పు టిడిపి అధినేత సైతం వారిని అనుమానంగా చూసే పరిస్థితి తెచ్చి పెట్టింది. పైకి బాబు ఇది ఓట్లు వేసేటప్పుడు శిక్షణ ఇవ్వడంలో లోపం అని చెప్పుకున్నా ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts