YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ లో వర్క్ అవుట్ కానీ స్వీయ నిర్భంధం

భారత్ లో వర్క్ అవుట్ కానీ స్వీయ నిర్భంధం

భారత్ లో వర్క్ అవుట్ కానీ స్వీయ నిర్భంధం
ముంబై, జూన్ 20
రతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య పెరిగిపోతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. క‌రోనా వైర‌స్ భారీ తుపునులా అన్ని ప్రాంతాల‌కు వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో భారతదేశంలో గరిష్టంగా రికార్డ్ స్థాయిలో 25,174 కొత్త కేసులు నమోదయ్యాయి, 369 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,81,320గా ఉన్నాయి. నాలుగులక్షలకు మనం ఎంతో దూరంలో లేం. ఇదే పరిస్థితి కొనసాగితే మనం వారంలో ఐదులక్షలకు చేరువ కావడం ఖాయం.వీటిలో 1,76,137 యాక్టివ్ కేసులు, 2,05,183మందికి నయమవగా.. 12,606 మంది మరణించారు. దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 1,20,504 మందికి కరోనా సోకింది. అయితే కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే.. రికవరీ రేటు పెరగడం. కోలుకుంటున్నవారు త్వరగా ఇళ్ళకు చేరుతున్నారు. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,751 మంది చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం 1,20,504 మందికి వ్యాధి సోకింది. వారిలో 60,838 మందికి నయమైంది. 53,915 మంది ఈ ఘోరమైన వైరస్‌తో పోరాడుతున్నారు.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మూడవ స్థానంలో ఉన్నప్పటికీ, మరణాల్లో మాత్రం ఇది రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకు 49,979 మందికి క‌రోనా సోక‌గా 21,341 మంది కోలుకున్నారు. 1969 మంది మరణించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌తో పాటు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడ్డారు. దక్షిణాదిన కరోనా హాట్ స్పాట్ గా మారింది తమిళనాడు. అక్కడ కరోనా వైరస్ సంక్రమణ కేసులు ఢిల్లీ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, మరణించిన వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అదే సమయంలో, రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. తమిళనాడులో ఇప్పటివరకు 52,334 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదవగా.. 625 మంది మాత్రమే మరణించారు. రాష్ట్రంలో 28,641మంది కోలుకున్నారు. కేవలం 23,068 యాక్టివ్ కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాలుగో స్థానంలోఉన్న గుజ‌రాత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 25,658 మందికి క‌రోనా సోక‌గా 17,827 మంది కోలుకున్నారు.1,592 మ‌ర‌ణించారు.. అయిదో ప్లేస్ కు చేరిన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 15,785 క‌రోనో పాజిటివ్స్ న‌మోదు కాగా, 9,638 మ‌ది కోలుకున్నారు. 488 మంది మృతి చెందారు.. ఆరో స్థానంలో రాజ‌స్థాన్ ఉంది.. ఈ స్టేట్ లో 13,857 మంది క‌రోనా బారీన ప‌డ‌గా 10,742 మంది కోలుకున్నారు.. 330 చ‌నిపోయారు.. ఏడో స్థానంలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 12,735 కి క‌రోనా సోక‌గా, 7,001 మంది కోలుకున్నారు..518 మృతి చెందారు..దేశంలో కరోనా కేసుల విషయంలో ఎనిమిదో స్థానంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 11,426 కేసులు న‌మోద‌య్యాయి.. వాటిలో 8,632 మంది కోలుకున్నారు. 486 మంది మ‌ర‌ణించారు.. తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతున్న హ‌ర్యానాలో 9218 కేసులు న‌మోదు కాగా, 134 మంది మ‌ర‌ణించారు.. ఇప్ప‌టి వ‌ర‌కు 4456 మంది కోలు కున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కరోనా పాజిటివ్..మొన్నటి పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది.తాజా పరీక్షలలో పాజిటివ్..హైదరాబాద్ లో చికిత్స, ఇటివలే ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో ఒకేరోజు 352 క‌రోనా పాజిటివ్ కేసులు వచ్చాయి,  జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా 302 కేసులు న‌మోదు.. ఇవాళ మ‌రో ముగ్గురు మృతి, మొత్తం పాజిటివ్ కేసులు 6027, ఇప్ప‌టి వ‌ర‌కు 195 మంది మృతి చెందారు. ఇటు ఏపీలోనూ కరోనా వీరవిహారం చేస్తూనే వుంది. ఏపీలో ఇవాళ కొత్తగా 425 కరోనా కేసులు రాగా ఇద్దరు మృతిచెందారు..ఏపీలో మొత్తం 92కి చేరాయి కరోనా మరణాలు.  గడిచిన 24 గంటల్లో ఏపీకి చెందిన 299 మందికి కరోనా రాగా ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన 100 మందికి సోకిన కరోనా.  విదేశాల నుంచి ఏపీకి 26 మందికి కరోనా సోకింది. 

Related Posts