తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీ రెడ్డి విషయంలో కమిటీ ఏర్పాటు చేయాలని సినిమాతోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన పలు మహిళ, పౌర హక్కుల సంఘాల నేతలు బుధవారం కలిసారు. ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు సంధ్య, సజయ, సృజన, ఝాన్సీ, కొండవీటి సత్యవతి ఇతరులు మంత్రిని కలిసారు. సంధ్య మాట్లాడుతూ శ్రీ రెడ్డి విషయంలో మీరు ఎదో ఒకటి చేయాలి. లైంగిక వేధింపుల కోసం కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. సినీ రంగంలో బ్రోకర్ ఆగడాలు ఎక్కువ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ప్రభుత్వం స్పందించాలని మంత్రిని కోరారు. చిన్న పిల్లలతో కూడా లైంగిక కార్యకలాపాలు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మరో మహిళా కార్యకర్త దేవి మాట్లాడుతూ .ఏదైనా కమిటీ ఏర్పాటు చేస్తే ఫార్మల్ గా కాకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. కేవలం నాలుగు కుటుంబాల్లో తెలుగు ఇండస్ట్రీ ఉందని అన్నారు. కొన్ని కుటుంబాల చేతిలో సినిమా థియేటర్ లు ఉన్నాయి.కొద్దీ మంది చేతుల్లో వ్యవస్థ కేంద్రీకృతం అవ్వడం వల్ల లైగింక వేధింపులు ఎక్కువ ఐయ్యాయి. సెలక్షన్ ప్రాసెస్ నుండి అమ్మాయిలు మూవీ చేసేంత వరకు అనేక రకాల వేధింపులు తప్పడంలేదని ఆమె అన్నారు.