ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు గడువు తేదీని పెంచాలి
ఎమ్మిగనూరు జూన్ 20,
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు ఆదివారంతో ముగింపు అవుతుందని,. గడువు తేదీని మరొక వారం రోజు పెంచాలని ఎన్ఎస్యూఐ నేతలు డిమాండ్ చేసారు. చాలామంది విద్యార్థులు పరీక్ష ఫీజును కరుణ ప్రభావం వల్ల చెల్లించలేదని, ఇంటర్ బోర్డ్, విద్యాశాఖాధికారులు దీని పైన చర్చించి ప్రభుత్వమే ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజును చెల్లించాలని ఎన్ ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 50 శాతం మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేదని, కొన్ని కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని దీనిపైన ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్ధి నాయకులు రాజు, బాలు,రవి యాదవ్,అజయ్,రాము పాల్గొన్నారు,