YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం దేశీయం విదేశీయం

చైనాతో ఆయుధాలతో కాదు..  ఆర్థిక వ్యవస్థతో యుద్ధం చేయాలి

చైనాతో ఆయుధాలతో కాదు..  ఆర్థిక వ్యవస్థతో యుద్ధం చేయాలి

చైనాతో ఆయుధాలతో కాదు..  ఆర్థిక వ్యవస్థతో యుద్ధం చేయాలి
హైదరాబాద్ జూన్ 20 
 చైనాతో  భారత్ యుద్ధం చేయాల్సింది  తుపాకులు, ఆయుధ సామాగ్రి తో కాదని... ఆర్థిక లావాదేవీల తో  చేయాలని  విశ్వహిందూ పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. దేశ సంపదను కొల్లగొడుతున్న  చైనా వ్యాపారంపై  దాడి చేయాలని  అభిప్రాయ పడ్డారు. దేశంపై దండయాత్ర చేస్తున్న  చైనా దేశపు  వస్తువులను బహిష్కరించాలని  డిమాండ్ చేస్తూ  విశ్వహిందూ పరిషత్ & బజరంగ్ దళ్ శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.  ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు పగడాకుల బాలస్వామి, శివరాం, శ్రీనివాస రాజా, ఇందు శేఖర్ మాట్లాడారు.  తమ వాణిజ్య  రంగాన్ని భారతదేశంలో విస్తరిస్తూ.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్న చైనా  ఆగడాలను అరికట్టాలని  డిమాండ్ చేశారు. నాణ్యతలేని వస్తువులను తక్కువ ధరకే అమ్మేసి కోటానుకోట్ల రూపాయలు దండుకుంటున్న చైనా దుర్మార్గాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశపు సొమ్ముతో తమ దేశంలో  ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకొని.. మళ్లీ మన దేశం పైనే దండెత్తి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత జవాన్లను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఆ దేశపు ఆగడాలను అంతం చేయాలన్నారు. ధన బలం పెరిగిన చైనా... మన శత్రు దేశమైన పాకిస్థాన్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా  మద్దతు తెలుపుతూ భారతదేశంపై ఉసిగొల్పుతోంది అన్నారు. అందుకే  ప్రతి భారతీయ పౌరుడు స్వదేశీ వస్తువులనే వాడాలని వారు కోరారు.   
వందల కిలోమీటర్ల కొద్ది భారత భూభాగాన్ని ఆక్రమిస్తూ వస్తున్న చైనా... నేడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మరింత భూభాగాన్ని కబ్జా చేసేందుకు పన్నిన కుట్రను భారత జవాన్లు ప్రాణాలకు ఎదిరించి ప్రతి దాడి చేయడం గర్వకారణమని ప్రశంసించారు. చైనా పోరులో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల త్యాగాలు స్పూర్తి దాయకమని అన్నారు. అంతకుముందు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వరకు బజరంగ్దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలో చైనా కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రతి భారతీయుడు స్వాభిమానం కలిగి ఉండి స్వదేశీ వస్తువులనే వాడాలని విజ్ఞప్తి చేశారు. ధర ఎక్కువైనా సరే నాణ్యత చూడాలని  సూచించారు. తర్వాత చైనా దేశాధినేత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు అఖిల్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts