YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

కొత్త నాటకాలు తెర తీసిన చైనా

కొత్త నాటకాలు తెర తీసిన చైనా

కొత్త నాటకాలు తెర తీసిన చైనా
న్యూఢిల్లీ, జూన్ 20,
గాల్వన్ విషయంలో చైనా అబద్దాలు, నాటకాలకు తెర తీసింది. గాల్వన్ లోయ తమ పరిధిలోకే వస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. తూర్పు లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతం వాస్తవాధీన రేఖకు తమవైపున ఉందని చైనా స్పష్టం చేసింది. గాల్వాన్ లోయలో జరిగింది ఇదంటూ.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝవో లిజియన్ వరుస ట్వీట్లు చేశారు. భారత బలగాలు సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు. గాల్వన్ ప్రాంతం ఎప్పటికీ తమదేనన్నారు.గాల్వన్ వ్యాలీలో తమ బలగాలు చాలా ఏళ్లుగా గస్తీ కాస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గత ఏప్రిల్ నుంచి భారత బలగాలు ఏకపక్షంగా, నిరంతరంగా ఈ ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్జిలను నిర్మిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చైనా పదే పదే నిరసనలు వ్యక్తం చేసినా.. భారత్ మరింత రెచ్చగొట్టిందన్నారు.‘‘మే 6న భారత బలగాలు వాస్తవాధీన రేఖ దాటాయి. చైనా భూభాగంలోకి ప్రవేశించి రక్షణ నిర్మాణాలు, బారికేడ్లు నిర్మించాయి. ఇవి చైనా గస్తీకి ఆటంకం కలిగించాయి. భారత బలగాలు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టాయి. దీంతో చైనా బలగాలు ప్రతిస్పందించాయి. పరిస్థితులను చక్కదిద్దడం కోసం భారత్, చైనా సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరిపాయి.చైనా ఒత్తిడి మేరకు వాస్తవాధీన రేఖ దాటిన భారత బలగాలు వెనక్కి తగ్గడానికి, నిర్మాణాలను తొలగించడానికి అంగీకరించాయి. జూన్ 6న కమాండర్ స్థాయి చర్చల్లో ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. గాల్వాన్ నదీ ముఖద్వారం దాటి గస్తీ నిర్వహించబోమని, నిర్మాణాలు చేపట్టబోమని భారత్ మాటిచ్చింది.కానీ అనూహ్యంగా జూన్ 15న భారత బలగాలు కమాండర్ల స్థాయి సమావేశంలో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. గాల్వన్ లోయలో మరోసారి వాస్తవాధీన రేఖ దాటొచ్చి రెచ్చగొట్టాయి. అంతే కాదు భారత బలగాలు చైనీస్ అధికారులు, సైనికులపై దాడికి తెగబడ్డాయి. దీంతో ఘర్షణ తలెత్తి ప్రాణ నష్టం వాటిల్లింది. గాల్వన్ ఘర్షణల్లో ఒక్కొక్కటిగా జరిగింది ఇది’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్లు చేశారు.

Related Posts