YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

పదవ తరగతిలో వందశాతం ఫలితాలు సాధించడంతో పాటు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించాలని విద్యార్థులను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు . 9.జిపిఎ సాధించి సిద్దిపేట గౌరవాన్ని నిలబెట్టాలని విద్యార్థులను మంత్రి కోరారు. బుధవారం నాడు  సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లి  గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ .7.65  లక్షలతో నిర్మించిన వివేకానంద రీడింగ్ భవనాన్ని అయన ప్రారంభించారు  తరువాత గ్రామంలో నాబార్డు గ్రామీణ సమీకృత అభివృద్ధి పథకం కింద రూ .14 కోట్ల  50 లక్షల వ్యయంతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలను కుడా మంత్రి ప్రారంభించారు. ఈ సంద్బంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క మండలంలో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక్కో పాఠశాల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు, ఈ లెక్కన మూడు వేల మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.డమనెది. నిజమైన బంగారు తెలంగాణ రాష్ట్రానికి ఇదే ఇదే నిదర్శనమని అయన అన్నారు.  విద్యాలయాలకు నిలయం ఎన్సాన్ పల్లి గ్రామం. ఒక్క సిద్దిపేట మండలంలోని అయిదు రెసిడెన్షియల్ పాఠశాలలు. ఎన్సాన్పల్లి గ్రామంలో జనరల్ గురుకుల పాఠశాల, మిట్టపల్లి గ్రామంలో ఎస్సీ గురుకుల పాఠశాల, నారాయణరావు పేట గ్రామంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాల, రాఘవాపూర్ గ్రామంలో కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల, ఇర్కోడ్ గ్రామంలో మోడల్ స్కూల్, ఈ ఐదు గురుకుల పాఠశాలలతో పాటు ఆరవ గురుకుల పాఠశాల చింతమడక గ్రామంలో ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూసా నిధులు  రూ.1కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్నిమంత్రి  ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, తహసీల్దార్ పరమేశ్వర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు గ్రామ సర్పంచ్ దండు రాములు, పాఠశాల ప్రిన్సిపల్ విష్ణు , నాయకులు రవీందర్ రెడ్డి, అధికారులు,  అధ్యాపక బృందం పాల్గొన్నారు. 

Related Posts