YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పొరుగు దేశాలతో స్నేహ హస్తం

పొరుగు దేశాలతో స్నేహ హస్తం

పొరుగు దేశాలతో స్నేహ హస్తం
బీజింగ్, జూన్ 20,
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. ఈ పరిస్థితుల్లో భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ను చైనా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మనకు మిత్రదేశమైన బంగ్లాను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలను తీవ్రం చేసింది. ఇప్పటికే నేపాల్‌ను చైనా తన వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. మ్యాప్ విషయంలో నేపాల్ భారత్‌కు వ్యవహరిస్తుండగా.. దీనికి వెనక చైనా హస్తం ఉందన్న విషయం విదితమే.సరిహద్దుల్లో చైనాకు భారత సైన్యం ధీటుగా బదులిస్తుండగా.. డ్రాగన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను మచ్చిక చేసుకోవడం కోసం చైనా వల విసురుతోంది. బంగ్లాకు చెందిన 5161 వస్తువులపై 97 శాతం టారిఫ్‌లను మాఫీ చేసింది. తక్కువ అభివృద్ధి చెందిన దేశమనే కారణంతో ఢాకా చైనాను రిక్వెస్ట్ చేయగా.. లఢక్ ఘర్షణలు తలెత్తిన మరుసటి రోజు.. జూన్ 16న చైనా సానుకూలంగా స్పందించింది. ఈ టారిఫ్‌ల మాఫీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఆసియా-పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ప్రకారం 3095 వస్తువులకు ఎలాంటి సుంకాలు లేకుండా వాణిజ్యం చేసే అవకాశాన్ని చైనా కల్పిస్తోంది. ఈ జాబితాలో మరిన్ని వస్తువులను చేర్చడం ద్వారా.. ఇరు దేశాలు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.బంగ్లా ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించింది. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఎన్ఆర్సీసీ విషయంలో బంగ్లాదేశ్ కొంత అసంతృప్తితో ఉంది. ఇదే అదనుగా చైనా బంగ్లాను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలను చేస్తోంది

Related Posts