YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సూర్య గ్రహణంతో జాగ్రత్త

సూర్య గ్రహణంతో జాగ్రత్త

సూర్య గ్రహణంతో జాగ్రత్త
హైద్రాబాద్, జూన్ 20,
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్య గ్రహణం ఎన్ని రకాలు. ఎలాంటి గ్రహణం ఏర్పడునుంది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుందంటే అందరికి తెలిసిందే. పురాణాల ప్రకారం రాహు-కేతువులు.. సూర్య-చంద్రులను మింగినపుడు గ్రహణాలు ఏర్పడాతాయని నమ్ముతారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డువచ్చినప్పుడు.. భూమిపై ఉన్న ప్రజలకు సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు. సూర్యుడిని చంద్రుడు కప్పి ఉంచిన తరుణంలో సూర్యుడు నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్య గ్రహణం అని అంటారు. చంద్రుడు.. సూర్యుడిని కప్పి ఉంచేందుకు కొంత సమయం పడుతుంది. ఈ కాలాన్ని గ్రహణ సమయమని అంటారు. జూన్ 21న సూర్య గ్రహణం సంభవించనున్న తరుణంలో ఎలాంటి గ్రహణం ఏర్పడుబోతుంది అని అందరికి సందేహం వస్తుంది. అసలు గ్రహణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అవేంటి? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.గ్రహణాల్లో మొదటిది సంపూర్ణ సూర్య గ్రహణం. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు భానుడి ఛాయ (నీడ) భూమిపై పడితే సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు భూమిపై ప్రజలకు సూర్యుడు అస్సలు కనిపించడు. ఈ విధంగా పూర్తిగా చంద్రుడు సూర్యుడిని కప్పి ఉంచుతారు. ఈ ప్రక్రియను సంపూర్ణ సూర్య గ్రహణం అని అంటారు. ఈ సమయంలో భూమిపై చీకటి ఆవరిస్తుంది. సూర్య గ్రహణం అమవాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది.ఈ జాబితాలో రెండోది పాక్షిక సూర్య గ్రహణం. ఈ ప్రక్రియలో సూర్యుడు కొద్ది భాగం మాత్రమే భూమిపై ప్రజలకు కనిపిస్తాడు. అంటే చంద్రుడు.. సూర్యుడిని కొద్ది భాగం మాత్రమే కప్పి ఉంచుతాడు. మిగిలిన భాగంలో గ్రహణం ఆవరించి ఉండదు. ఈ విధాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు. ఈ ప్రక్రియలో భూమిపై ప్రజలు సూర్యుడిని కొంత మేర చూడవచ్చు. సూర్యుడి నీడ పూర్తిగా కాకుండా కొద్ది భాగం కనిపిస్తుంది.ఈ జాబితాలో మూడోది వలయాకరపు సూర్య గ్రహణం. ఈ ప్రక్రియలో చంద్రుడు.. భూమికి దూరంగా జరుగుతాడు. ఈ సమయంలో చంద్రుడు.. సూర్యుడి మధ్య భాగాన్ని మాత్రమే కప్పి ఉంచుతాడు. అప్పుడు చంద్రుడు చుట్టూ సూర్యుడు కిరణాలు రింగు వలే మారుతుంది. భూమిపై ఉన్న ప్రజలకు సూర్యడు నీడ వలయాకారంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియను వలయాకారపు సూర్య గ్రహణం అని అంటారు. ఈ విధానంలో సూర్యుడు కొంత భాగం మాత్రమే కనిపిస్తాడు.ఈ సూర్య గ్రహణం దాదాపు మూడు గంటల 26 నిమిషాల కొనసాగనున్నది. సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 21 ఆదివారం అమవాస్య రోజున ఈ గ్రహణం ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల సమయంలో గ్రహణం మధ్యస్థంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. దీని తర్వాత ఈ ఏడాది చివరలో మరో సూర్య గ్రహణం రానుంది. అయితే జూన్ 21న రానున్న సూర్య గ్రహణాన్ని దేశంలోని ప్రజలందరూ వీక్షించవచ్చు. అయితే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి.

Related Posts