అమ్మాయిని వేధించిన వ్యక్తి అరెస్టు
గోదావరిఖని జూన్ 21
గత నెలలో గోదావరిఖని కి చెందిన ఒక అమ్మాయి ఫోటో ని మరియు ఫోన్ నెంబర్ ని లోకాంటో ఆప్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఐ.డి క్రియేట్ చేసి అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టినాడని పిటిషన్ ఇవ్వగా గోదావరిఖని 1 టౌన్ లో సి.ఐ-2 రాజ్ కుమార్ గౌడ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినారు. కేసు కి సంబంధించి సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ బి. స్వామి, పి.సి నరేష్ సహాయంతో నిందితున్ని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది.వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ కి చెందిన అందె వంశీ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్నాడు అతని ఆఫీస్ లో పనిచేసే కోలిగ్ అయినా ఈ అమ్మాయి అతని ప్రేమ ని తిరస్కరించిందని, ఆమె పై ద్వేషం తో తనని ఇబ్బందుల పాలు చేయాలనే దురుద్దేశ్యం తో ఆ అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబర్ ని లోకాంటో ఆప్ లో పోస్ట్ చేసి ఆ అమ్మాయి ఇబ్బంది పెట్టే విదంగా చేసినాడు. సాంకేతిక పరిజ్ఞానం తో అతని లొకేషన్ గుర్తించి ఈ రోజు నిందితుడైన అందె వంశీ ని గోదావరిఖని 1 టౌన్ లో అరెస్ట్ చేసారు.