YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అన్నింట నకిలీలే  రాజ్యం

అన్నింట నకిలీలే  రాజ్యం

అన్నింట నకిలీలే  రాజ్యం
కడప,జూన్ 22, 
ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ మేజర్ మండలాల్లోనూ, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఉన్నా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు బజార్లకు తీసుకెళితే దళారులు ప్రవేశించి రైతు మార్కెట్లలో రాజ్యమేలుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా ఆరుగాళాలు శ్రమించి పండించిన పంటలకు ప్రతిఫలం దక్కకుండా నకిలీ వ్యాపారస్తులు రైతుల అవతారమెత్తి మార్కెట్ యార్డుల్లో కూడా రైతులను దగా చేస్తున్నారు. అలాగే డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినా వారి వ్యాపారాల్లో కూడా దళారులదే పెత్తనం కొనసాగుతోంది. అడుగడుగునా రాజకీయనేతల వత్తిళ్లతో ప్రభుత్వ పథకాలు నీరుగారిపోతున్నాయి. జిల్లాలో పులివెందుల, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు తదితర ప్రాంతాల నుంచి అరటి, మామిడి కూరగాయలసాగు నడిరోడ్లపైనే బజార్లలో రైతులు మార్కెట్‌కు పండిన కాయలు, పండ్లను తీసుకొస్తే వాహనాల నుంచి రైతులు తమ సరుకులను కిందకు దించకముందే రాబందుల తరహాలో దళారులు నకిలీ రైతుల తరహాలో రాజ్యమేలుతున్నారు. కాగా హలం బట్టే రైతును ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవడానికి దళారీ వ్యవస్థను రూపుమాఫీ రైతు బజార్లు నెలకొల్పేందుకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 20నుంచి 40సెంట్లలో రైతు బజార్లను కడప, ప్రొద్దుటూరులలో రెండేసి రైతు బజార్లు నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. గతంలో కడప, ప్రొద్దుటూరులో ఉన్న రైతుబజార్లు మూతపడ్డాయి. జిల్లా నుంచి మండలస్థాయి వరకు 50 నుంచి 200 ఎకరాల వరకు ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు కూడా నెలకొల్పనున్నారు. ప్రస్తుతం రైతు బజార్లు ఏర్పాటుకు మార్కెటింగ్‌శాఖ ఈ బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇవ్వడం, రైతులు పండించిన కొన్ని పంటలకు కోల్డ్ స్టోరేజిలు ఏర్పాటుచేసి మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఆరుగాళాలు కష్టపడే రైతులను గుర్తించి ప్రభుత్వం వారికి గుర్తింపుకార్డులు జారీ చేసి రైతు బజార్లలో స్థలాలు కేటాయించి తనిఖీలుచేసి వారికి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో రైతులకు ఎటువంటి సౌకర్యాలు లేని కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు మార్కెట్‌కు తెచ్చేలోపే దళారులు వాటిని లాక్కుంటున్నారు. ఇప్పటికైనా రైతు బజార్లలో ఇక నుంచి పాత పద్ధతులకు స్వస్తిచెప్పి నిజమైన రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Related Posts