YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?*

ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?*

ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?*
(పౌష్టికాహార సూచనలు)
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది.
ప్రతిరోజు దాదాపు 10వేల పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. 
స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
_*శాఖాహారం*_
_తినవలసినవి:_
-- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి
-- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు 
-- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి
-- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి
-- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది
-- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి
-- ఇంటిలో వండిన ఆహారాన్ని తినండి. క్రొవ్వు పదార్థాలు మరియు నూనెలను తక్కువగా తినండి
-- పండ్లను, కూరగాయలను తినడానికి ముందు శుభ్రంగా కడగండి
-- వెన్న తీసిన పాలు మరియు పెరుగును తీసుకోండి. వీటిలో ప్రోటీన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
*_తినకూడనివి* :_
-- మైదా, వేపుళ్ళు మరియు జంక్ ఫుడ్(చిప్స్, కుక్కీస్) తినకండి
-- శీతల పానీయాలు, ప్యాక్ట్ జ్యూస్ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగకండి - వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి 
-- చీజ్, కొబ్బరి మరియు పామాయిల్, బటర్ తినకండి. వీటిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వు పదార్థాలు ఉంటాయి
*మాంసాహారం*
_తినవలసినవి:_
-- మాంసాహారాన్ని తాజా పదార్ధాలతో పాటు నిల్వ ఉంచకండి
-- స్కిన్ చికెన్, చేపలు మరియు గ్రుడ్డు తెల్లసొన మొదలగు వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వండి.
*_తినకూడనివి* :_
-- మాంసం, లివర్, వేపిన మాంసాన్ని తినకండి
-- వారంలో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే మాంసాహారాన్ని తీసుకోండి
-- పూర్తి గ్రుడ్డుని (పచ్చసొనతో కలిపి) వారంలో ఒక్కసారి మాత్రమే తీసుకోండి
*గమనిక:* కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం పైగా రోగులు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్ప లక్షణాలైన తక్కువ జ్వరం లేక దగ్గు కనిపించవచ్చు. అటువంటి వారు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు ఇంట్లో ఉండవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
*జాగ్రత్తగా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో!!!* 
*అజాగ్రత్తగా ఉంటే ఐసీయూలో ఐసోలేషన్ లో!!!*  

*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*
 

Related Posts