YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

యదేఛ్చగా నకిలీ విత్తనాల విక్రయాలు

యదేఛ్చగా నకిలీ విత్తనాల విక్రయాలు

యదేఛ్చగా నకిలీ విత్తనాల విక్రయాలు
ఖమ్మం, జూన్ 22
నకిలీ విత్తనాల కారణంగా రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నారు. పత్తి, మిర్చి, వరి విత్తనాల్లో ఈ నకిలీ ఎక్కువగా ఉంటోంది. రైతులు ఇరుగుపొరుగు వారిని అడిగి మార్కెట్‌లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల విత్తనాలను తెచ్చి సాగు చేస్తున్నారు. అందులో కొన్ని నకిలీ విత్తనాలు ఉండటంతో మొక్క ఎదిగినా పూత, కాత ఉండడం లేదు. దీంతో అప్పటివరకు పెట్టిన పెట్టుబడులన్నీ రైతులు నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో ఇలా నష్టపోయిన రైతులు వ్యవసాయాధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. కొన్ని కంపెనీల విత్తనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినా నివేదికలను తెప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల తాము సరఫరా చేసిన విత్తనాలు నాణ్యమైనవేనంటూ విత్తన కంపెనీలు కోర్టును ఆశ్రయించడంతో పరిహారం అంశం తేలడం లేదు. ఇంకొన్ని చోట్ల తక్కువ ధరకు విత్తనాలు లభిస్తున్నాయనే కారణంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో కొందరు చోటా నాయకులు విత్తన వ్యాపారుల అవతారం ఎత్తి రైతులకు పత్తి విత్తనాలు అంటగడుతున్నారు. ఏటా ఖరీఫ్‌ ఆరంభానికి ముందు రైతు చైతన్య యాత్రల పేరిట గ్రామాలకు వెళ్లే వ్యవసాయ అధికారులు.. ఈ ఏడాది రైతుబంధు చెక్కుల పంపిణీతో తీరిక లేకుండా గడిపారు. ప్రస్తుతం బదిలీల హడావుడి కొనసాగుతుండడంతో రైతులకు విత్తనాలపై మార్గనిర్దేశనం కొరవడింది. దాదాపు అన్ని జిల్లాల్లో నకిలీ విత్తనాల వ్యాపారం జరుగుతుండగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. నకిలీ విత్తనాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. మిర్చి నకిలీ విత్తన వ్యవహారం 2016లో ఇక్కడే బయటపడింది. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన బాధ్యులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. గతేడాది కూడా పత్తి, మిర్చి రకాల్లో నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా 5 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి పరిస్థితీ అంతే. ఇక రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విక్రయించిన వరి విత్తనాల్లో సరైన మొలక శాతం లేకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. పరిహారంపై కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు.  ఈ ఖరీఫ్‌లో విత్తనాల కొరత లేకుండా చూస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నా మండల పాయింట్లలోకి ఇండెంట్‌లో సగమే వచ్చాయి. కొన్నిచోట్ల ఇంకా వస్తున్నాయి. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయని, సాగు పనులు ముమ్మరం అయ్యేసరికి విత్తనాలు సరఫరా అవుతాయని స్థానిక వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న విత్తనాలను ప్రైవేటు కంపెనీలు విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

Related Posts