YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత.. పరారీలో డ్రైవర్ క్లీనర్లు

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత.. పరారీలో డ్రైవర్ క్లీనర్లు

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత.. పరారీలో డ్రైవర్ క్లీనర్లు
అదిలాబాద్ జూన్ 22,
అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో సీతాగొంది వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న లారి ని పట్టుకున్నారు.  భోరజ్  చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనం ఆపకుండా వెళ్లడంతో రవాణా శాఖ అధికారులు యోగేశ్వర్ శ్రీకాంత్ లు  వెంబడించి లారీని పట్టుకున్నారు.  లారీ డ్రైవర్ క్లీనర్లు లారీని సీత గొంది సమీపంలో నిలిపి పరారయ్యారు. ఎం వి ఐ లు లారీని తనిఖీ చేసి చూడగా 27 పశువులు వున్నాయి. దాంతో  లారీ ని గుడిహత్నూర్ మండలం లోని డొంగర్ గావ్ గ్రామంలో గల కామధేను గోశాలకు తరలించి పశువులకు చికిత్సలు అందించారు.  వాహనాన్ని పోలీసులకు అప్పగించారు.ఈ సందర్భంగా కామధేను గోశాల నిర్వాహకుడు నిర్వాహకుడు ఆర్యన్ మహారాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమంగా పశువులను తరలిస్తే చట్టం లో ఎన్ని శిక్షలు ఉన్నప్పటికి ఇప్పటి వరకు సుమారుగా  ఇరవై వాహనాలు వరకు పట్టుకున్నా, ఇంకా పశుసంపదను అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు.  ఇలా దొంగచాటుగా చేస్తూ పోతే రాబోయే తరాలకు  పశుసంపద అంతరించిపోతుందని అన్నారు.  ప్రతి ఒక్కరిపై పశుసంపదను కాపాడుకునే బాధ్యత ఉందని,  అందరు సహకరించాలని మన సంపదను కాపాడుకోవాలని కోరారు.

Related Posts