భావనకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ప్రియాంక చోప్రా
మలయాళ బ్యూటీ భావన పెళ్లికూతురైంది. సోమవారం తన ప్రియుడు, నిర్మాత నవీన్‌తో ఆమె ఏడడుగులు వేయనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
అందులో "హ్యాపీ మారీడ్ లైఫ్. నీ జీవిత ప్రయాణంలో ఇదొక పెద్ద అడుగు. గుడ్ లక్. నువ్వో గొప్ప ధైర్యవంతపు మహిళవు. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను" ప్రియాంక తెలిపింది. కాగా గతేడాది మార్చిలో నవీన్‌తో భావన నిశ్చితార్ధం జరిగింది. 'హీరో', 'మహాత్మ', 'నిప్పు' సినిమాలతో భావన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన విషయం తెలిసిందే.