YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిబంధనలకు తూట్లు

నిబంధనలకు తూట్లు

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు మినహా ఇతరులకు భూములపై హక్కులు ఉండవు. ఈ భూములను ఇతరులకు విక్రయించడం.. వారు అమ్ముకోవడం నిషిద్ధం. అయితే ఖమ్మం జిల్లాలో ఈ నిబంధన సరిగా అమలుకావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను కొనడం, అమ్మడం చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వదిలేస్తోందని, నిబంధనలు అమలు చేయడంలేదని చెప్తున్నారు. రెవెన్యూ సిబ్బందికి ముడుపులు అందడం వల్లే వారు ఉదాసీనంగా ఉంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు బదులుగా గిరిజనేతరులు భూములపై హక్కులు కలిగి ఉండటం వివాదాస్పదమవుతున్నా ఈ అంశానికి రెవెన్యూ విభాగం పెద్దగా ప్రాధాన్యతనివ్వడంలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రెవెన్యూ నిబంధనల ప్రకారం.. గిరిజన ప్రాంతాల్లో భూములకు గిరిజనేతరులు హక్కుదారులు కాదు. ఈ విషయాన్ని అధికారులే తేల్చిచెప్తున్నారు. అయినా ప్రాంతీయంగా మాత్రం ఈ నియమాళిని వర్తింపచేయడంలేదు.

ఖమ్మం జిల్లా  గేటు కారేపల్లి రెవెన్యూ పరిధిలో ఓ గిరిజనేతరుడికి 3ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఉసిరికాయలపల్లి, విశ్వనాథపల్లిలోనూ ఇలాంటి అవకతవకలు సాగినట్లు సమాచారం. మాదారం రెవెన్యూ పరిధిలోనూ ఈ తరహా అక్రమం వెలుగుచూసింది. ఏజెన్సీ భూములకు సంబంధించిన నియమావళి 1/70 చట్టంలో ఉంటుంది. ఈ చట్టానికి స్థానిక రెవెన్యూ సిబ్బంది తూట్లు పొడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. సిబ్బందిలో కొందరు ముడుపులు తీసుకుంటూ గిరిజనేతరులు ఏజెన్సీ భూములు పొందడంలో సహకరిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం ఉన్నతాధికారులు స్పందించి ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు. లేదంటే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని భూ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతాయని హెచ్చరిస్తున్నారు.

Related Posts