YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వైసీపీ ఎంపీల దీక్ష భగ్నం

వైసీపీ ఎంపీల దీక్ష భగ్నం

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో గత ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలు మిథున్, అవినాష్ రెడ్డిల దీక్షను పోలీసులు బుధవారం భగ్నం చేశారు. దీక్షలో ఉన్న ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల ఆరోగ్యం క్షీణించడంతో వారిని బలవంతంగా దీక్షా శిబిరం నుండి పోలీసుల సహాయంతో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. షుగర్ లెవల్స్, బిపి తగ్గడంతో పాటు ఎంపీలు డీ హైడ్రేషన్ తో బాధపడతున్నారు. అవినాష్ రెడ్డి రక్తపోటు స్థాయి 80/60కి పడిపోయింది. మిధున్ రెడ్డి బీపీ 110/70గా ఉండగా, బ్లడ్ షుగర్ 73కు తగ్గింది. ఇద్దరి శరీరాల్లో కీటోన్స్ 2గా ఉన్నాయని పరీక్షలు చేసిన వైద్యులు వెల్లడించారు. డాక్టర్ల నిర్ణయం మేరకు ఎంపీలను పోలీసులు అసుపత్రికి తరలించారు. ఆ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ఉన్న వైకాపా శ్రేణులు వారిని తరలిస్తున్న అంబులెన్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఏపీ భవన్ వద్ద కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వాహనాలను అడ్డుకున్న వారిని చెదరగొట్టి ఎంపీలను ఆసుపత్రికి తరలించారు. అయితే, తాము ఆసుపత్రిలో దీక్ష కోనసాగిస్తామని ఎంపీలు స్పష్టం చేసారు. పార్లమెంటు నిరవదిక వాయిదా పడిన వెంటనే రాజీనామాలను చేసిన లోక్సభలో వైకాపా ఐదుగురు ఎంపీలు రాజీనామా చెసిన వెంటనే ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలోని ఆంద్రప్రదేశ్ భవన్ లో నిరాహర దీక్ష చేస్తున్నారు. తొలుత ఐదుగురు ఎంపీలు దీక్షలో కూర్చోగా మేకపాటి, వరప్రసాద్, సుబ్బారెడ్డిలను ఇంతకు ముందే పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

Related Posts