YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

టాలీవుడ్ లో సినీ మంటలు

టాలీవుడ్ లో  సినీ మంటలు

టాలీవుడ్‌రెండుగా చీలిపోయిందా.. సినీ ఇండ్రస్ట్రీ ప్రత్యేక మంటలు ఎగసిపడుతున్నాయా.. ఇప్పటికే శ్రీలీక్స్‌తో టాలీవుడ్‌పరువు కాస్తా.. బజారున పడింది.. ఒక్కొక్కరి గుట్టు విప్పుతూ శ్రీరెడ్డి సంచలనాలకు కేరాఫ్‌ఆడ్రస్‌మారింది. తాజాగా ప్రముఖ నిర్మాతలపై నట్టి కుమార్‌నిర్మాత మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్‌రెండుగా చీలిందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.నటి శ్రీరెడ్డి లీక్స్‌పుణ్యమా అని ఇప్పటికే టాలీవుడ్‌పరువు కాస్త బజారున పడింది. సినీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో మాయని మరక అంటింది. టాలీవుడ్‌లో తెలుగోళ్లకు సినీ అవకాశాల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేకమంది అనేకసార్లు మొర పెట్టుకున్నా.. తమ ఆవేదన వెల్లగక్కినా ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఇది కామన్ అన్నట్లు తయారైంది. అవకాశాల కోసం దర్మకులు, హిరోలకు లోంగాల్సిందేనని.. లేనిపక్షంలో అవకాశాలు రావంటూ శ్రీరెడ్డి ఇప్పటికే మండిపడుతోంది. టాలీవుడ్‌పరువు బజారున పడుతున్నా.. సినీపెద్దలు మాత్ర పట్టించుకున్న పాపాన పోలేదు. రీసెంట్‌శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపైనా పెద్దగా స్పందించింది ఏమీ లేదు. తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఆ ఆధిపత్యం మా నిర్ణయంలోనూ కనిపించింది. తాజాగా సినీ నిర్మాత నట్టి కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబును పలువురు సినీప్రముఖులు చంద్రబాబును కలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెళ్తే అందరూ కలిసి వెళ్లాలి కానీ కేవలం ఆ ఐదుగురు మాత్రమే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిర్మాతలు వెళ్లి సీఎం చంద్రబాబు కలిసారని ఆరోపించారు. అంతేకాదు.. నిర్మాతల మండలికి తెలియకుండా వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు సమర్థించినప్పుడు ఒక్క టీడీపీని మాత్రమే ఎందుకు సంప్రదించాలరిన నట్టికుమార్‌ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీతో పాటు వైసీపీ, జనసేన, లెఫ్ట్‌పార్టీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయని గుర్తు చేశారు. అలాంటిది కేవలం టీడీపీకి మాత్రమే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలని.. అవసరమైతే దీక్షకు సిద్దం కావాలన్నారు. మరోవైపు నట్టికుమార్‌ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు జెమినీ కిరణ్‌.. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడాలన్నారు.. మీడియోలో ఆరోపణలు చేయడం సరికాదన్న జెమినీ కిరణ్‌.. తాము నిర్మాతల మండలి తరపున వెళ్లలేదని.. వ్యక్తిగతంగా వెళ్లి చంద్రబాబును కలిసినట్లు చెప్పారు.

Related Posts