పదవ తరగతి విద్యార్దులకు గ్రేడ్లు ఖారారు
హైదరాబాద్ జూన్ 22
పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి. సంబంధిత వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి పేర్కొన్నారు. మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. కాగా, మార్చిలో జరిగిన పరీక్షలు కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడగా, ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అంతర్గత మూల్యాంకనం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఎలా చూసుకోవాలి : పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట బీఎస్ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్ లోకి లాగినై, టీఎస్ ఎస్సెస్సీ గ్రేడ్‌లు 2020 క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే గ్రేడింగ్‌ను చూపిస్తుంది. వీటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.