YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 14 నుంచి చంద్రబాబు జన్మదిన వారోత్సవాలు

ఈనెల 14 నుంచి చంద్రబాబు జన్మదిన వారోత్సవాలు

ఈ నెల 20 న ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నెల 14 నుండి చంద్రబాబు జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తాం. తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలా కాకుండా కళా రంగాన్నీ ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం ఉంటుందిని అన్నారు. ఈ ఉత్సవాలకు కన్వీనర్ గా ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వ్యవహరిస్తారు. ప్రతి రోజు ఒక ముఖ్య అతిధి ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రాంమ్మోహన్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులు పుట్టిన నెల ఏప్రిల్, అటువంటి నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టారు. ఏప్రిల్ నెల ను పవిత్ర నెలగా భావించి 14 నుండి తుమ్మలపల్లి లో కళారంగాన్నీ ప్రోత్సహించేలా కళా వారోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఒక కళాకారుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఏప్రిల్ నెలలో ఎంతో మంది మహనీయులు జన్మించారు... అటువంటి వ్యక్తులను కించపరిచేలా కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ నెల 14 నుండి నిర్వహించే కళా వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Related Posts