YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వర్గం

విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వర్గం

విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వర్గం
విశాఖపట్టణం, జూన్ 23
విజయసాయిరెడ్డికి మరో పేరు విశాఖ సాయిరెడ్డి. ఆయన అంతలా 2015 నుంచి విశాఖతో అనుబంధం పెనవేసుకునిపోయారు. అయితే విజయసాయికి ఇపుడు అదే మైనస్ అవుతోంది. ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చిన సాయిరెడ్డి విశాఖలో పెత్తనం చేయడమేంటి అని ఇంతకాలం టీడీపీ నుంచి విమర్శలు వచ్చేవి. ఇపుడు సొంత పార్టీలో గోతులు తవ్వే బ్యాచ్ ఒకటి తయారైంది. ఈ బ్యాచ్ కి ల్యాండ్ మాఫియాతో దగ్గర బంధం ఉండడంతో విజయసాయిరెడ్డిని బ్యాడ్ చేయాలని డిసైడ్ అయిందని అంటున్నారు.నిజంగా విజయసాయిరెడ్డి విశ్వాసానికి మారుపేరుగా ఉన్నారని అంటారు. ఆయనకు జగన్ అన్ని విషయాలూ చెప్పేవారు. అసలు విశాఖకు రాజధాని తరలివస్తుంది అన్న సంగతి జగన్ తరువాత తెలిసిన మనిషి విజయసాయిరెడ్డి ఒక్కరే. కానీ విజయసాయిరెడ్డి దాన్ని ఎక్కడా బయటపెట్టలేదు, క్యాష్ చేసుకోలేదు. పైగా చివరిదాకా దాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అదే ఇపుడు ల్యాండ్ మాఫియాకు మంటగా ఉంది. అమరావతిలో టీడీపీ వారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినట్లుగా తాము కూడా చేసుకోవచ్చు కదా అని వైసీపీలో కొందరికి కోరిక ఉంటే, గత టీడీపీ హయాంలో దందా చేసిన బ్యాచ్ ఇపుడు వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటోంది. వారికి సర్కార్ సాయం కావాలి. అయితే విజయసాయిరెడ్డి ఉంటే ఏదీ పడనివ్వరు అని ఏకంగా ఆయన్నే సైడ్ చేయడానికి వైసీపీలోని ఒక వర్గం భారీ స్కెచ్ గీస్తోందట.నిజానికి జగన్ కి విజయసాయిరెడ్డి కుడిభుజం లాంటి వారు. అటువంటిది జగన్ కి ఆయన్ని దూరం చేయడం అంటే సాధ్యం కాదు. అందుకే విజయసాయిరెడ్డి క్యారక్టర్ ను బ్యాడ్ చేయడానికి కూడా పార్టీలోని ఒక వర్గంతో పాటు విపక్షం కూడా కలసి కొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. విజయసాయిరెడ్డి అధికారులతో కలసి మొత్తం దందా చేస్తున్నారని, ఆయనకు ఆయనే ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నారని ఈ వర్గం ప్రచారం చేస్తోంది. ఆయన జగన్ ని సైతం లెక్కచేయడంలేదని అంటోంది.ఇక విజయసాయిరెడ్డిని బదనాం చేసేలా సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగులు కూడా పెడుతున్నారని ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి అల్లుడిని సీన్లోకి తెచ్చి మరీ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తాను విశాఖలో భూదందాలకు అవకాశం లేకుండా చేసినందుకే ఈ పరిణామాలు కొంతమంది చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. అమరావతి మీద మనమే ఆరోపించి ఇపుడు విశాఖలో దందాలు చేస్తే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రెడ్డి గారు భయపడుతున్నారు. అయితే ఆయన్ని చెడ్డ చేస్తే జగన్ నుంచి దూరం చేస్తే తమ పబ్బం గడుస్తుందని ల్యాండ్ మాఫియా పార్టీలోని ఓ వర్గం నాయకులతో బురద జల్లిస్తోంది. మరి జగన్ దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related Posts