YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జిల్లాల్లో మారిపోతున్న గ్రూపులు

 జిల్లాల్లో మారిపోతున్న గ్రూపులు

 జిల్లాల్లో మారిపోతున్న గ్రూపులు
ఒంగోలు, జూన్ 23,
జగన్ వచ్చిన వారికి వచ్చినట్లు కండువాలు కప్పుతున్నారు. నిజంగా ఇది సొంత పార్టీ వైసీపీలో అలజడి రేగుతుందని జగన్ కు తెలియంది కాదు. ఎందుకంటే టీడీపీ నేతలను చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించడమే. రెండు వర్గాలు కలసి పనిచేయడం కష్టమని అందరికీ తెలిసిందే. అయితే జగన్ మాత్రం వస్తానంటే ఊ అంటున్నారు. వేగంగా కండువాలు కప్పేస్తున్నారు. కానీ ఎటువంటి హామీలు వారికి ఇవ్వకపోవడం విశేషం.ఇటీవల మాజీ మంత్రి శిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆయన 2014 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేశారు. అయితే ఇప్పుడు పార్టీలో చేరే సందర్భంగా శిద్ధా రాఘవరావుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా జగన్ నుంచి వారు హామీలు పొందేందుకు ప్రయత్నించారు. “పార్టీ కోసం కష్టపడండన్నా.. తర్వాత చూద్దాం” అని జగన్ సున్నితంగా తప్పించుకున్నారని చెబుతున్నారు.గతంలో కరణం బలరాం వైసీపీలో చేరినప్పడు కూడా ఆయనకు జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కరణం అద్దంకి నియోకవర్గ ఇన్ ఛార్జిగా తన కుమారుడు వెంకటేష్ ను నియమించాలని కరణం బలరాం కోరినా నవ్వి ఊరుకున్నారే తప్ప ఎలాంటి హామీ ఇవ్వలేదు. కరణం చేరి దాదాపు రెండు నెలలు అవుతున్నా అద్దంకి ఇన్ ఛార్జి పదవి దక్కలేదు. దీంతో పాటు చీరాల వైసీపీ నియోజకవర్గాని ఆమంచి కృష్ణమోహన్ ఇన్ ఛార్జిగా ఉంటారని ప్రకటించడం విశేషం.వీళ్లేకాదు పార్టీలోకి వచ్చి చేరే వాళ్లకు జగన్ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. భవిష్యత్ పై కూడా ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. జగన్ దృష్టిలో ఉంటేనే పదవి వస్తుందని అందరికీ తెలుసు. పార్టీలో చేరిన వెంటనే పదవి దక్కించుకుంది ఒక్క చల్లా రామకృష్ణారెడ్డి మాత్రమే. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటారు. ఇలా జగన్ మిగిలిన పార్టీల నేతలను చేర్చుకుంటున్నా వారికి ఎటువంటి హామీ ఇవ్వకపోతుండటం వైసీపీ ఎమ్మెల్యేలకు ఊరట కల్గించే అంశమే.

Related Posts