YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

 పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి.. రోగులతో నిండిన దవాఖానలు

 పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి.. రోగులతో నిండిన దవాఖానలు

 పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి.. రోగులతో నిండిన దవాఖానలు
ఇస్లామాబాద్‌ జూన్ 23
పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నది. వైరస్‌ కేసుల నమోదు రేటు ఇటీవల బాగా పెరిగింది. మే నెలలో ప్రతి రోజు 2,000 నుంచి 3,000 వరకు కరోనా కేసులు నమోదు కాగా జూన్‌ 15కి ఈ సంఖ్య 6,800కి చేరింది. ఇప్పటి వరకు పాక్‌లో సుమారు రెండు లక్షల మందికి కరోనా సోకగా, 150 మంది వరకు మరణించారు. కరోనా ఉధృతి ఇలాగే కొనసాగితే ఆగస్టు నాటికి 12 లక్షల మందికి వైరస్‌ సోకవచ్చని, 3,500 మందికిపైగా చనిపోవచ్చని ఆ దేశ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆ దేశంలోని దవాఖానలన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో కొత్త రోగులను చేర్చుకోలేక తిప్పి పంపుతున్నారు.మరోవైపు కరోనా నియంత్రణకు పాక్‌ ప్రభుత్వం విధించిన నిబంధనలను ఆ దేశ ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోగా భౌతిక దూరాన్ని కూడా పాటించడం లేదు. మార్కెట్లు, మసీదుల వద్ద వేలాది మంది గుమిగూడుతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటే భయమేస్తున్నదని రేడియో పాకిస్థాన్‌కు చెందిన ఉద్యోగి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సహోద్యోగుల్లో ఇద్దరు కరోనా వల్ల మరణించారని, తమ కార్యాలయంలో 20 మందికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. మరోవైపు కరోనా మరణాలను రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయినట్లుగా ఆ దేశ అధికారులు పేర్కొంటున్నట్లు విమర్శలొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావిత పది దేశాల జాబితాలో పాకిస్థాన్‌ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆ దేశానికి లేఖ రాసింది. వైరస్‌ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టని పక్షంలో పెను ప్రమాదం తప్పదని హెచ్చరించింది. 
 

Related Posts