YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

రష్యాకు బయలుదేరిన రాజ్‌నాథ్‌ సింగ్‌

రష్యాకు బయలుదేరిన రాజ్‌నాథ్‌ సింగ్‌

రష్యాకు బయలుదేరిన రాజ్‌నాథ్‌ సింగ్‌
న్యూఢిల్లీ జూన్23
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం రష్యాకు బయలుదేరారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రయాణమయ్యారు. రష్యాలో మూడు రోజులపాటు ఆయన పర్యటించనున్నారు. మాస్కోలో నిర్వహించే రెండో ప్రపంచ యుద్ధం 75వ విజయోత్సవ పరేడ్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటారు. రష్యా, భారత్‌ మధ్య బలమైన సంబంధాలతోపాటు రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆ దేశ పాలకులతో చర్చిస్తారు. ఆయన వెంట రక్షణ శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు.రష్యాకు బయలుదేరే ముందు.. మూడు రోజుల పర్యటనకు మాస్కోకు వెళ్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్ ట్వీట్‌ చేశారు. రష్యాతో రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరిహద్దులో చైనాతో ఘర్షణ నెలకొన్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. 

Related Posts