YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కోర్టులో అయ్యన్నకు ఊరట

 కోర్టులో అయ్యన్నకు ఊరట

 కోర్టులో అయ్యన్నకు ఊరట
విజయవాడ, జూన్ 23
మాజీ మంత్రి అయ్యాన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అయ్యాన్న దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయదా వేసింది. ఇటీవల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారనే ఆరోపణలపై ఆమె చేసిన ఫిర్యాదుతో నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం పోలీసులు కేసు ఫైల్ చేశారు.అయ్యన్నపాత్రుడు తాత, మాజీ ఎమ్మెల్సీ రుత్తల లచ్చాపాత్రుడు చిత్రపటం మునిసిపల్‌ కార్యాలయంలో తొలగించారని వివాదం రేగింది. దీంతో గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు.. అయ్యన్నపాత్రుడు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సభలో తనను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మున్సిపల్ కమిషనర్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.దీంతో అయ్యన్న తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేశారు. అధికార పార్టీ కక్షతో తనపై అక్రమంగా కేసు బనాయించారని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయడంతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని, పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

Related Posts