YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పెట్రోల్ ధరలపై తగ్గడం  భారం ...ఎన్నాళ్లు

పెట్రోల్ ధరలపై తగ్గడం  భారం ...ఎన్నాళ్లు

పెట్రోల్ ధరలపై తగ్గడం  భారం ...ఎన్నాళ్లు
న్యూఢిల్లీ, జూన్ 23
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి ఆరేళ్లవుతుంది. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ అంటూ నినాదాలు ఎత్తుకున్న నరేంద్ర మోదీ ప్రజల నడ్డిని విరచడంలో ముందున్నారని చెప్పక తప్పదు. ఆయన పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అమలు చేస్తూనే మరోవైపు మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తూనే ఉన్నారు...జీఎస్టీ తో ప్రభుత్వ ఆదాయాన్ని మోదీ గణనీయంగా పెంచుకోగలిగారు. జీఎస్టీ వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్న కేంద్ర ప్రభుత్వం ఆ మాట తర్వాత తప్పింది. జీఎస్టీ కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలపైనే ఎక్కువ భారం పడుతుంది. రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని తెచ్చుకుంటున్న మోదీ, అదే రాష్ట్రాలకు ప్రయోజనాలు చేకూర్చడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇదే రకమైన ఫిర్యాదులు అందుతున్నాయి.ఇక పెట్రోల్, డీజిల్ ను తీసుకుంటే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయలకు చేరువలో ఉంది. ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు భారీగా తగ్గుతున్న పెట్రోల్ ధరలను మాత్రం కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోగా రోజుకింత చొప్పున పెంచుతూ పోతుంది. దీంతో పెట్రో భారం కూడా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలపైనే ఎక్కువగా పడుతుంది.కరోనా సంభవించి దాదాపు మార్చి నెల చివరి నుంచి నేటి వరకూ ఎవరికీ ఉపాధి అవకాశాలు లేవు. కరనా వైరస్ తో అందరి ఆదాయం పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచితే ఆ ప్రభావం అన్ని వస్తువులపై పడుతుంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రో ఉత్పత్తులతో మరింత పెరగనున్నాయి. మొత్తానికి మోదీకి పేద, మధ్య తరగతి వర్గాలపై దయలేకుండా పోయిందన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా విన్పిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరలను చమురు కంపెనీలు పెంచుతున్నా ఏం చేయలని నిస్సహాయ స్థితిలో మోదీ ఉండటం విశేషం.

Related Posts