YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధానిపై యూ టర్న్ తీసుకున్నారా...?

రాజధానిపై యూ టర్న్ తీసుకున్నారా...?

రాజధానిపై యూ టర్న్ తీసుకున్నారా...?
విజయవాడ, జూన్ 23
రాజధానిపై జగన్ ప్రభుత్వం సర్వే చేయించిందా? ప్రజా భిప్రాయాన్ని తెలుసుకుందా? రాజధాని అమరావతిని తరలించ వద్దని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారా? అంటే అవుననే అంటున్నారు. మూడు రాజధానుల అంశంపై జగన్ ప్రభుత్వం సర్వే చేయించిందంటున్నారు. ఈ సర్వేలో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న అభిప్రాయం ఎక్కువ మంది వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.తాజాగా వైసీపీలో కీలకమైన మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. రాజధానిని ఇప్పట్లో తరలించడం సాధ్యం కాకపోవచ్చని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. దీనికి కారణంగా కరోనా వైరస్ అని ఆయన చెప్పినా అసలు కారణం వేరే ఉందంటున్నారు. ఈ సర్వే ఫలితాల వల్లనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో కొంత ఆలోచనలో పడ్డారన్న ప్రచారం పార్టీలోనే జరుగుతుండటం విశేషం.మరోవైపు విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయవద్దంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అందాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విశాఖలో రక్షణ పరంగా పరిపాలన రాజధాని ఏర్పాటు వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందంటున్నారు. ఇలా ఒకవైపు సర్వే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టే అవకాశముందంటున్నారు.తాజాగా జరుగుతున్న సంఘటనలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. గత కొంతకాలంగా రాజధాని ప్రాంతాన్ని పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. మంత్రి బొత్స సత్యనారాయణ వరస పర్యటనలు రాజధాని ప్రాంతంలో చేస్తున్నారు. రాయపూడి లో ఇన్ టేక్ వెల్ పనులు, కరకట్ట పనులను ఆయన పరిశీలించారు. ఈరోజు మ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అసెంబ్లీ, సచివాలయ సిబ్బంది గృహసముదాయాలను పరిశీలించారు. ఇవన్నీ చూస్తుంటే రాజధాని ప్రతిపాదన కొంత పక్కన పెట్టేస్తున్నారనే ప్రచారం ఆ ప్రాంతంలో జరుగుతోంది. అయితే వైసీపీ సీనియర్ నేతలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటవుతాయని చెబుతున్నారు.

Related Posts