ఏలూరు : ప్రస్తుత పరిస్థితి పదవికోసం పోరాటంలా ఉంది. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. టిడిపి మొదటినుండి బిజెపి పెరగకూడదు అని చేసిన ప్రయత్నం చాలా దురదుష్టకరమని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. టిడిపి ఎటువంటి వైఖరిని అనుసరించినా బిజెపి చేయవలసిన సాయం చేస్తుంది. బిజెపి కి ఎవరిమీద కక్ష ఉండదు. 99 శాతం ఒంటరిగా పోరాడతాం. టిడిపి యే బిజెపి తో కలుస్తానన్నా మనం ఆశ్చర్య పడనవసరంలేదని అయన అన్నారు.