బలహీనపడుతున్న కరోనా వైరస్
జెనీవా, జూన్ 23,
పంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్.. క్రమేనా బలహీనపడుతోందా? త్వరలోనే వైరస్ పూర్తిగా అంతమవుతుందా? వ్యాక్సిన్‌తో పనిలేకుండానే కోవిడ్-19 కనుమరుగు కానుందా? దీనిపై పరిశోధకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. జెనోవాలోని శాన్ మార్టినో జనరల్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రొఫెసర్ బస్సెట్టి మాటియో ‘సండే టెలిగ్రాఫ్’కు చెప్పిన కొన్ని వివరాలను వింటే.. కరోనా అంతమైపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అనిపిస్తుంది. అయితే, ఆయన వాదనను వైద్య నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.నాలుగు వారాల నుంచి ప్రభావం కోల్పోయింది - ప్రొఫెసర్ మాటియో: ‘‘కరోనా వైరస్ ఇప్పుడు ‘పెద్ద పులి’ దశ నుంచి క్రమేనా ‘అడవి పిల్లి’ స్థాయికి చేరుతోంది. బలహీనపడుతున్న కరోనా సోకితే 80 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వృద్ధులు సైతం వైరస్ నుంచి కోలుకోగలరు. ఇదే వయస్సులో ఉన్న వృద్ధులు రెండు మూడు రోజుల కిందట వైరస్ వల్ల చనిపోయారు. అయితే, ఇకపై ఆ పరిస్థితి కనిపించదు. ఎందుకంటే.. గత నాలుగు వారంల నుంచి వైరస్ క్రమేనా తన ప్రభావాన్ని కోల్పోతోంది. క్రమేనా బలహీనమవుతోంది. ఇది మున్ముందు మరింత బలహీనమైన వ్యాక్సిన్ అవసరం లేకుండానే చనిపోతుంది’’ అని తెలిపారు
ఈ విషయాన్ని మాటియో గతంలో కూడా వెల్లడించారు. అయితే, యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్‌గావ్‌కు చెందిన డాక్టర్ ఆస్కార్ మెక్‌లీన్ ఖంటించారు. మాటియో చెబుతున్న విషయాలన్నీ నిరాధారమైనవని, బాధితుల నుంచి సేకరిస్తున్న ‘శ్వాబ్’ టెస్టుల్లో వైరస్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోందని తెలిపారు. కేవలం లాక్‌డౌన్ వల్లే వైరస్‌ను నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు.‘బలమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా ఇలాంటి విషయాలను బయటకు చెప్పకూడదు. భయానకమైన వైరస్‌ను తక్కువ చేసి చూపిస్తే.. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండలేరు. వైరస్ ఇంకా తన ఉనికిని చాటుతోంది. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వైరస్ బలహీనపడుతోందనే ఆధారాలేవీ లేవు’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో మనం వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండటమే మంచిదని, నిర్లక్ష్యం వద్దని పేర్కొన్నారు. చైనాలోని హాంగ్ జౌలో జరిగిన ఓ సమావేశంలో కరోనా వైరస్ పుట్టుక, అంతం గురించి చర్చ జరిగింది. చైనాకు చెందిన ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, కరోనా నిపుణుల బృంద సభ్యుడు ప్రొఫెసర్ లి లంజు వాన్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌లో కొన్ని నెలలుపాటే జీవిస్తుందని తెలిపారు. -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రం సుమారు 20 ఏళ్లు వరకు జీవించగలదన్నారు. వైరస్ ఉహాన్‌లో మాంసాహారాన్ని విక్రయించే మార్కెట్లోనే పుట్టింది. ఈ నేపథ్యంలో పచ్చి మాంసం, చేపల్ని తినడం తగ్గిస్తే వైరస్ నుంచి బయటపడవచ్చని హెచ్చరించారు. మాంసాహార రవాణాపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.