YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటి పంటకు చేయూత

ఇంటి పంటకు చేయూత

ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల కొరత ఉంటోంది. డిమాండ్‌కు తగ్గట్లుగా కూరగాయలు ఉండడంలేదు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేయాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు స్థానికంగానే కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ విభాగం యత్నిస్తోంది. ప్రత్యేక కాలనీలు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున కాయగూరలు పండించాలని యోచిస్తోంది. అంతేకాక ఇంటి పైకప్పులపైనా సాగును ప్రోత్సహిస్తూ బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా సేంద్రియ పద్ధతుల్లో సాగుకు దన్నుగా ఉండాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆరిక సంవత్సరం నుంచి ఇంటి పంటకు గరిష్ఠంగా రూ.30వేల పంట రుణం ఇవ్వడానికి రాష్ట్రసాయి బ్యాంకర్ల సమితి అంగీకరించింది. దీంతో పాటు సేంద్రీయ పద్ధతులతో ఏ పంటలు సాగు చేసినా ఎకరానికి రూ.40వేలు పంట రుణం ఇవ్వాలని నిర్ణయించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటల్లో రసాయన అవశేషాలు ఉండవు. దీంతో ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలు ఉండవు. 

వాస్తవానికి జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం తక్కువగా ఉంది. రైతులు ఆహారం, వాణిజ్య పంటలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అనేక కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని కూరగాయలు పండించాలని వ్యవసాయాధికారులు ప్లాన్ చేశారు. దీంతో పాటు పట్టణాల్లోని ఇంటిపై కప్పులపై కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. సాధారణంగా పంట పొలాల్లోనే కూరగాయలను సాగు చేస్తారు. 31 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నా వివిధ రకాల కాయగూరలు మాత్రం పండించడంలేదు. దీంతో ఆయా రకాల కోసం దిగుమతులుపైనే ఆధారపడాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ స్థలం ఉండి, ఆసక్తి ఉన్న కొద్ది మంది తమ అవసరాల వరకు కూరగాయలు సాగు చేసుకుంన్నారు. అయితే ఇంటి పంటను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని రసాయనాల్లేని ఆహారం అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ తరహా పంట పెద్ద ఎత్తున ఉత్పత్తి అయితే ప్రజల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని చెప్తున్నారు.

Related Posts