రేణిగుంట రైల్వే స్టేషన్లో బుధవారం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వైకాపా నాయకులు,కార్యకర్తలు రైలు రోకో నిర్వహించారు. దీనితో రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు, ఆర్.పి.ఎఫ్, జి.ఆర్.పి.భారీగా మోహరించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఉద్యమ కారులు ఆందోళనలను విరమించారు. దీనితో రైళ్లు యాధావిధంగా నడిచాయి. రైల్ రోకో చేయడం రైల్వే యాక్ట్ ప్రకారం పెద్ద నేరమని రైల్ రోకో చేసిన వారి క్లిపింగ్లు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా అందరిపై కేసులు నమోదు చేసి నోటీసులు పంపుతామని రైల్వే పోలీసులు పేర్కొన్నారు అయితే ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తామో ఇప్పుడే చెప్పామన్నారు