YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ బాస్...వ్యూహాం ఏమిటీ

గులాబీ బాస్...వ్యూహాం ఏమిటీ

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపైన టీఆర్ఎస్ వైఖరీ గందరగోళంగా ఉంటోంది. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్న గులాబీ పార్టీ పూటకో వైఖరీని ప్రదర్శిస్తోంది.బీజేపీని కొంచెం సేపు మిత్రుడిగా...మరి కొంచెం సేపు శత్రువుగా  చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ కడతామన్న కేసీఆర్ మోదీ సర్కార్ పైన పోరాటానికి మాత్రం  వెనకాడుతుండటం విశేషం. కేంద్రంపైన పోరాటంలో టీఆర్ఎస్ విధానం పూటకో విధంగా మారుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా అప్పుడప్పుడు గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానుకూలంగా తన స్టాండ్ మారుస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతునిచ్చిన ఆయన ఆ తర్వాత మోదీ సర్కార్ తీరు మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలకు కేంద్రం సరైన రీతిలో న్యాయం చేయడం లేదని నిప్పులు చెరిగారు. తెలంగాణకు మోదీ తోడ్పాడు లేదంటు ఆరోపణలు గుప్పించారు. కేంద్రానికి తెలంగాణ నుంచి ఎంత ఆదాయం వెళ్తుందన్న దానిపైన ఆయన లెక్కలు కూడా చెప్పారు. ఇదే సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చిన కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం కావాలని గళమిప్పారు.ఒక వైపు ఫ్రంట్ అంటున్న కేసీఆర్ మరో వైపు బీజేపీ విషయంలో అనుసరిస్తున్న  విధానం గందరగోళానికి దారి తీస్తోంది. పార్లమెంటులో అవిశ్వాసం పైన చర్చ జరగకుండా కొన్ని రోజుల పాటు అడ్డుకోవడం ద్వారా టీఆర్ఎస్ బీజేపీకి అనుకూలమన్న ప్రచారానికి ఆస్కారమిచ్చింది. అయితే చివర్లో మేల్కొన్న కేసీఆర్ లోక్ సభలో తమ పార్టీ ఆందోళన చేయదని ప్రకటించారు. అవిశ్వాసం చర్చలో పాల్గొంటామని ప్రకటించడం ద్వారా తాము బీజేపీకి అనుకూలం కాదన్న సంకేతాలిచ్చారు. తాజాగా కేంద్రంపైన టీఆర్ఎస్ వైఖరీ మరో సారి గందరగోళానికి దారి తీసింది. 15వ ఆర్థిక సంఘం నిబంధనల సడలింపు పైన దక్షణాది రాష్ట్రాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి. దీని వల్ల ఆదాయ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతుందని సౌత్ స్టేట్స్  వాదిస్తున్నాయి. దీనిపైన చర్చించేందుకు కేరళ ప్రభుత్వం దక్షణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో తిరువనంతపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భేటీకి చివరి నిమిషంలో తెలంగాణ డుమ్మా కొట్టింది. తాము ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇదే సమయంలో తమిళనాడు కూడా భేటీకి దూరంగా ఉంది.  దీంతో టీఆర్ఎస్, అన్నాడీఎంకే వైఖరులపైన అనుమానాలు తీవ్రమౌతున్నాయి.  ఫెడరల్ ఫ్రంట్ తో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేస్తానంటున్న కేసీఆర్ ఇలాంటి భేటీలను రాజకీయంగా మరింతగా ఉపయోగించుకునే వీలుంటుంది. కాని ఎందుకో ఈ విషయాల్లో కేసీఆర్ వ్యూహాం మరోలా ఉంటుంది. మొత్తానికి కాషాయ వాదుల విషయంలో గులాబీ పార్టీ ఆలోచనలు వ్యతిరేకమా, అనుకూలమా, తటస్థమా అన్న విషయం నాయకులు,కార్యకర్తలకు అర్థం కావడం లేదు. 

Related Posts