చైనా సరిహద్దుల్లో భారత్ ప్రత్యేక బలగాలు
న్యూఢిల్లీ జూన్ 23
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. పర్వత ప్రాంతాల్లో పనిచేయడం కోసం కఠోర శిక్షణ పొందిన బలగాలను సరిహద్దులకు తరలించింది. ఈ బలగాలకు ఎత్తయిన ప్రాంతాల్లో చైనా అతిక్రమణలను సమర్థంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. ఈ బలగాలు సరైన మార్గం లేని, వాహనాలు కూడా వెళ్లలేని ప్రాంతాలకు కాలినడన వెళ్లి యుద్ధం చేయగలవు. పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ప్రత్యేక బలగాలు కీలకపాత్ర పోషించాయి. ఒకవైపు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూనే.. మరోవైపు అక్కడ నిర్మాణంలో ఉన్న 32 రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం కేంద్రం హోంశాఖ సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణంపై చర్చిండం కోసం సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించింది.