YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఐడీ కార్యాలయానికి మంత్రి గంటా

సీఐడీ కార్యాలయానికి మంత్రి గంటా

సీఐడీ కార్యాలయానికి మంత్రి గంటా
అనుమతి నిరాకరించిన పోలీసులు
విశాఖపట్నం జూన్ 23
ఏపీలో సిఐడీ దూకుడు పెంచింది.గత ప్రభుత్వ హాయంలో సిఐడీకి డోర్లు మూసేస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వ హాయంలో సిఐడీకి వర్క్ పెరుగుతోంది.విశాఖలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.సీఐడీ అదుపులో ఉన్న తన సన్నిహితుడు నలంద కిషోర్ను కలిసేందుకు ప్రయత్నం చేశారు.. అయితే, విచారణ జరుగుతుందంటూ కార్యాలయంలోకి అనుమతించలేదు సీఐడీ అధికారులు.. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నలందా కిషోర్ విషయంలో సీఐడీ తీరు సరిగాలేదని మండిపడ్డారు.. కిషోర్ అరెస్ట్ను ఖండించిన ఆయన.. కిషోర్ దేశద్రోహానికి పాల్పడలేదు, రక్షణ వ్యవహారాలను లీక్ చేయలేదు.. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ను షేర్ చేసినట్టు చెప్పారు.  చాలా మంది వేలాది మెసేజ్లను షేర్ చేస్తున్నారన్న గంటా.. ఇది మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేయాల్సినంత సమస్య కాదన్నారు. ఏదైనా ఉంటే నన్ను టార్గెట్ చేయండి.. నా సన్నిహితులను కాదని వ్యాఖ్యానించారు గంటా శ్రీనివాసరావు. కాగా, ఈరోజు తెల్లవారుజామున సీఐడీ పోలీసులు కిషోర్ను అదుపులోకి తీసుకున్నారు.. విశాఖలోని సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. 
 

Related Posts