YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దొంగతనాలు- జాగ్రత్తలు పై అవగాహన 

దొంగతనాలు- జాగ్రత్తలు పై అవగాహన 

దొంగతనాలు- జాగ్రత్తలు పై అవగాహన 
నెల్లూరు జూన్ 23 
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని 29వ డివిజన్ లో దొంగతనాలు- జాగ్రత్తలపై స్థానిక 5వ నగర పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29వ డివిజన్ పరిధిలోని 8 కాలనీలలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు దొంగతనాలు- జాగ్రత్తలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. డివిజన్ పరిధిలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇంచార్జి చెక్క సాయి సునీల్, సచివాలయ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts