YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

పరీక్షలు రద్దు చేయాలి

పరీక్షలు రద్దు చేయాలి

పరీక్షలు రద్దు చేయాలి
అమరావతి జూన్ 23 
కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఈ  నేపథ్యంలో విద్యార్థులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.  పదో తరగతి రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించిన విధంగానే డిగ్రీ తుది సంవత్సరం చదువుతున్నవారి విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలి.  డిగ్రీతోపాటు ఎం.బి.ఎ., ఏజీ బీఎస్సీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐ.టీ.ఐ., లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడంలేదు.  ఈ విద్యార్థులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్ళడం, హాస్టల్స్ లో ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్ళి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని అయన అన్నారు. మరో వైపు - పై చదువులకు వెళ్ళేందుకు, క్యాంపస్ సెలెక్షన్స్ లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోంది. పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్థులు జనసేన దృష్టికి తీసుకువచ్చారు.  లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలి.  ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారు.  రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని విశ్వ విద్యాలయాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అయన అన్నారు.

Related Posts