YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఉద్యోగ ,ఉపాధ్యాయ,పెన్షనర్ల వేతనాల కోత ఆర్డినెన్స్ రద్దు చేయాలి

ఉద్యోగ ,ఉపాధ్యాయ,పెన్షనర్ల వేతనాల కోత ఆర్డినెన్స్ రద్దు చేయాలి

ఉద్యోగ ,ఉపాధ్యాయ,పెన్షనర్ల వేతనాల కోత ఆర్డినెన్స్ రద్దు చేయాలి
జగిత్యాల  జూన్ 23 
 కోవిడ్ -19 నైపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మార్చి నెల నుండి వేతనంలో కోతలు విధించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూన్ నెల నుండి పూర్తి వేతానాలు చెల్లించాలని తెలంగాణ స్టేట్ ప్రైమరీ స్కూల్స్ హెడ్మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావికంటి పవన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  వరుసగా మూడు నెలల నుండి వేతనాల కోత  వల్ల ప్రతి నెల బ్యాంకులకు చెల్లించాల్సిన  ఈ ఎమ్ ఐ లు, పిల్లల భారీ ఫీజులు,  ఇతర ఆరోగ్య స్థితిగతులు, కుటుంబ ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్న తరుణంలో జూన్ నెల పూర్తి వేతనం చెల్లిస్తూ, మార్చి నెల నుంచి రావలసిన  బకాయిలను వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల అకౌంట్ లలో జమ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్లో ఎక్కువ శాతం దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వారు కనుక , వారి  వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్ నెల పూర్తి వేతనం చెల్లించాలని కొరారు.

Related Posts