YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

నీళ్లు తాగడం లేదని తల్లిదండ్రులు వేసిన శిక్ష

నీళ్లు తాగడం లేదని తల్లిదండ్రులు వేసిన శిక్ష

నీళ్లు తాగడం లేదని తల్లిదండ్రులు వేసిన శిక్ష
న్యూఢిల్లీ, జూన్ 23,
పసివాడిని కంటికి రెప్పలా చూసుకోవలసిన తల్లిదండ్రులే ఆ పిల్లాడి పాలిట కాలయముడు అయ్యారు. అన్నీ నీళ్లు తాగలేనని చెబుతున్నా సరే.. పీకలదాక నీళ్లు తాగే శిక్ష విధించి కొడుకు చావుకు కారణమయ్యారు. అమెరికాలోని కొలరాడోలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.జాకరీ సబిన్ అనే 11 ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా మూత్ర సమస్యతో బాధపడుతున్నాడు. అతడి మూత్రం మరీ చిక్కగా ముదురు రంగు కలర్‌లోకి మారడంతో.. తండ్రి రైన్, పినతల్లి తారా రోజు నీళ్లు బాగా తాగాలని సూచించారు. అయితే, తారా ఓ రోజు సబిన్‌ను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వచ్చేందుకు వెళ్లింది. సబిన్ వాటర్ బాటిల్‌లో ఇంకా నీళ్లు ఉండేసరికి.. అతడిని ప్రశ్నించింది. నీళ్లు ఎందుకు తాగలేదని అడిగింది. దీంతో సబిన్ ఆగ్రహం వ్యక్తం శాడు. ఇందుకు రైన్, తారా.. అతడికి నీళ్లు తాగే పనిష్మెంట్ ఇచ్చారు. తాము చెప్పేవరకు బయటకు రావద్దని తెలిపారు. దీంతో సబిన్ వంట గదిలో నిలుచుని సుమారు నాలుగు గంటల సేపు నీళ్లు తాగుతూనే ఉన్నాడు. ఫలితంగా అతడికి వాంతులు కూడా వచ్చాయి. అయినా సరే వారు అతడిని పట్టించుకోలేదు. సబిన్ ఏం చేస్తున్నాడో చూసేందుకు వంటగదిలోకి వెళ్లాడు. అక్కడ కిందపడి ఉన్న సబిన్‌ను పైకి లేపాడు. అయితే, సబిన్ మళ్లీ వెనక్కి పడ్డాడు. దీంతో తలకు గాయమైంది. రైన్ చెప్పిన వివరాల ప్రకారం.. కిందపడి లేచిన తర్వాత సబిన్ వింతగా మాట్లాడాడు. దీంతో అతడు నీళ్లు తాగి ఇబ్బంది పడ్డాడని భావించి నిద్రపోవాలని చెప్పాను. తర్వత రోజు ఉదయం బెడ్ మీద పడుకుని ఉన్న సబిన్.. శరీరమంతా చల్లగా మారిపోయి బిగుసుకుపోయింది. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే సబిన్ చనిపోయాడని వైద్యులు తెలిపారు.సబిన్ ఆహారం తినకుండా నాలుగు గంటల సేపు సుమారు 83 లీటర్ల నీటిని తాగి ఉంటాడని వైద్యులు అంచనా వేశారు. శరీరానికి ఎంత కావాలో అంతే నీటిని తాగాలని, అంతకంటే ఎక్కువ నీటిని తాగితే ప్రాణాలకు ప్రమాదమని తెలిపారు. తాము వేసిన శిక్ష వల్లే బాలుడు చనిపోయాడని భావించిన రేన్, తారాలు.. పోలీసుల ముందు లొంగిపోయారు.

Related Posts