YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ట్రంప్ సంచలన నిర్ణయం

ట్రంప్ సంచలన నిర్ణయం

ట్రంప్ సంచలన నిర్ణయం
లోకల్ ఫస్ట్ నినాదాన్ని తీసిన అమెరికా
వాషింగ్టన్, జూన్ 23,
ఎన్నికల నేపథ్యంలో మరోసారి లోకల్ అస్త్రాన్ని ఉపయోగించుకుని లబ్ది పొందాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 23 లక్షల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 1.22 లక్ష మంది మృత్యువాతపడ్డారు. దీంతో కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ట్రంప్ స‌ర్కార్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. దీనిలో భాగంగా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి వ‌చ్చే వ‌ల‌స‌లదారుల‌‌పై మూడు నెలలు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్న‌ట్లు ఏప్రిల్‌లోనే ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే.తాజాగా, ఈ నిషేధాన్ని డిసెంబరు వరకు పొడిగిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కరోనా సంక్షోభంతో స్వ‌దేశంలో ఏర్పడిన నిరుద్యోగ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హెచ్‌1-బీ, హెచ్-4 స‌హా అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై నిషేధం కొనసాగుతుందని, ఈ మేర‌కు సోమవారం ప్ర‌త్యేక ఆదేశాలు జారీచేశారు. ట్రంప్ నిర్ణ‌యంతో హెచ్‌1-బీ వీసాలు, ఎల్ వీసాలు, హెచ్‌2-బీ సీజనల్ వర్కర్ వీసాలు, జే వీసాలతో అమెరికాలోకి వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయ్యింది.వ‌ర్క్ వీసాల‌పై నిషేధం జూన్ 24 నుంచి అమల్లోకి వ‌స్తుంద‌ని, 2020 డిసెంబర్ 31 వరకు ఇది అమ‌ల్లో ఉంటుంద‌ని అధికారిక ప్ర‌క‌టన చేసింది. నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, అమెరికా పౌర‌స‌త్వం ఉన్న‌వారి భార్య, పిల్లలు, అదేవిధంగా ఆహార స‌ర‌ఫ‌రా రంగంలో ఉన్నవారికి ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని స్పష్టం చేసింది. యుఎస్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అర్హత సాధించిన విదేశీ విద్యార్థులకు కూడా ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది. హెచ్-1బీ వీసా జారీకి అనుసరిస్తున్న ప్రస్తుత లాటరీ వ్యవస్థలో విస్తృత సంస్కరణలకు కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది వేతన స్థాయి, నైపుణ్యం స్థాయి రెండింటినీ పెంచుతుంది. ఉద్యోగాల కోసం అమెరికన్లతో పోటీని కూడా తొలగిస్తుంది’ అని ఒ అధికారి తెలిపారు. ఈ సంస్కరణల వల్ల నైపుణ్యం, ప్రతిభ ఉన్నవారు ఉద్యోగాలు పొంది, అధిక వేతనాలు దక్కుతాయి.. అత్యంత ప్రతిభావంతులకు మేలు జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.

Related Posts