YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నిమ్మగడ్డ అడ్డంగా బుక్కయారే...

 నిమ్మగడ్డ అడ్డంగా బుక్కయారే...

 

 నిమ్మగడ్డ అడ్డంగా బుక్కయారే...
విజయవాడ, జూన్ 24, 
ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడ్డంగా దొరికిపోయారు. ఎంత వివరణలు ఇచ్చుకున్నా.. ఎవరు కాదన్నా నిమ్మగడ్డ మాత్రం బుక్కయిపోయారు. అయితే పార్క్ హయత్ హోటల్ లో జరిగిన సమావేశానికి అసలు సూత్రధారి చంద్రబాబు అని చెబుతున్నారు. ఆయన ఈ ముగ్గురితోనూ వీడియో కాల్ లో మాట్లాడినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫేస్ టైం లో మాట్లాడిన చంద్రబాబు వారికి ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమయిపోయింది. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అనితా రాణి వరకూ కొంత ప్రయత్నించినా అవి పెద్దగా పేలలేదు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక కూడా చంద్రబాబు ఉన్నారని అధికార పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అయితే దానిని నిజం చేస్తూ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం వెలుగు చూడటం చంద్రబాబుకు మరింత ఇబ్బందిగా మారనుందనే చెప్పాలి.తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి పోయిన సుజనా చౌదరి బీజేపీ అంటే ఏపీలో ఎవరూ అంగీకరించరు. బీజేపీలోనే ఆ విషయాన్ని అంగీకరించని వాళ్లు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ సుజనా చౌదరి చంద్రబాబు తో టచ్ లో ఉంటారు. ఆయన పంపితేనే బీజేపీలోకి సుజనా చౌదరి వెళ్లారన్న వాదన కూడా ఉంది. ఇక పార్క్ హయత్ హోటల్ లో కామినేని శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనా చౌదరి తో పాటు చంద్రబాబు కూడా ఫోన్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు.సుజనా చౌదరి మాత్రం తనను వ్యక్తిగతంగా కలిసేందుకే వారిద్దరూ వచ్చారని చెబుతున్నప్పటికీ త్వరలో ఆ పుటేజీ కూడా బయటకు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ స్కెచ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పడిపోయారు. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఏపీ ఇంటలిజెన్స్ ఉంటుందన్న విషయం ఆయనకు తెలియంది కాదు. తెలంగాణ ప్రభుత్వ సహకారం కూడా ఏపీ సర్కార్ కు ఉండి ఉండవచ్చు. అందుకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరిన్ని వివరాలు అతి త్వరలో అన్నారంటే ఆ బిగ్ బాస్ ఎవరనేది మళ్లీ వీడియోలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. నిమ్మగడ్డ ఎపిసోడ్ పూర్తి కాలేదని, సశేషమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Related Posts