పరీక్షల తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ
విజయవాడ, జూన్ 24
కరోనా టెర్రర్ ప్రపంచాన్ని వణికిస్తోంది. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ.. విద్య, ఉద్యోగ పరీక్షలన్నీ వాయిదా పడిన తెలిసిందే. అయితే ప్రపంచం మొత్తం కరోనాతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2 నుంచి 13 వరకు గ్రూప్-1 ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
మిగిలిన పరీక్షల తేదీలు:
సెప్టెంబరు 15, 16 తేదీల్లో డీఎల్ (డిగ్రీ కాలేజీ లెక్చరర్ల) నియామక పరీక్షలు
సెప్టెంబరు 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
సెప్టెంబరు 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు
సెప్టెంబరు 22న రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ నియామక పరీక్ష
సెప్టెంబరు 23న పోలీసు శాఖలోని టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబరు 23, 24న పట్టణ ప్రణాళిక అసిస్టెంట్ విభాగంలో డైరెక్టర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష
సెప్టెంబరు 23, 24 తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల నియామక పరీక్ష
సెప్టెంబరు 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
సెప్టెంబరు 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు ఉంటాయి.