YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆయన విశ్వవిఖ్యాత 'పప్పు' సార్వభౌమ

ఆయన విశ్వవిఖ్యాత 'పప్పు' సార్వభౌమ

అధికారంలోకి వచ్చిన  నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని తెలుగు దేశం ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. 13 మంది మంత్రుల పనితీరు భేష్ అని సీఎం అంటున్నారు. అవునుమరి.. ఒక్క రోడ్డు కూడా వేయలేని సీఎం కొడుకు విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమకు, విచ్చలవిడిగా బార్లు పెట్టి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ఇతర మంత్రులకు ఈ కితాబు దక్కాల్సిందేనని ఆమె అన్నారు. బుధవారం హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

‘మూడు సెంటీమీటర్ల వర్షానికే తాత్కాలిక సెక్రటేరియట్ భవనంలోకి ఆరు సెంటీమీటర్ల నిళ్లొచ్చాయి. నాలుగేళ్లపాటు ఏకపక్షంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇవాళ అఖిలపక్షం భేటీకి పిలిస్తే ఏఒక్కరూ వెళ్లని పరిస్థితి అని రోజా పేర్కొన్నారు. 

ఏపీలో  ప్రభుత్వ పథకాలపై 71 శాతం సంతృప్తి ఉందట. రుణమాఫీ కాక రైతులు అప్పులపాలైనందుకా, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినందుకా, ఇంటికో ఉద్యోగం, దళితులకు ఇళ్లు దక్కినందుకా? ఏ విషయంలో జనం సంతృప్తిగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. నాడు వైఎస్సార్ అంటే ఆరోగ్యశ్రీ, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంట్ లాంటి పథకాలు గుర్తొచ్చేవి. మరి చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని నిలదీసారు. ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎన్నికలకు వెళదాం. టీడీపీ సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.

Related Posts