YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

కరోనా టెస్టులు వ్యాపారం కాదు : ఈటెల

కరోనా టెస్టులు వ్యాపారం కాదు : ఈటెల

కరోనా టెస్టులు వ్యాపారం కాదు : ఈటెల
హైద్రాబాద్, జూన్ 24
కరోనా టెస్టులను వ్యాపార కోణంలో చూడొద్దని ప్రయివేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు మంత్రి ఈటల హితవు పలికారు. విమాన ప్రయాణికులకు కరోనా లక్షణాలు లేకున్నా టెస్టులు చేయొచ్చని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని ప్రయివేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లను మంత్రి ఈటల కోరారు. సాధారణ పరీక్షలకు కోవిడ్ పరీక్షలకు చాలా తేడా ఉందన్నారు. ఇక్కడ సర్వెలేన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని... కాబట్టి పాజిటివ్ వచ్చిన ప్రతి పేషంట్ వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందించాలన్నారు.కరోనా టెస్టు కోసం వచ్చిన ప్రతి ఒక్కర్నీ రిజల్ట్ వచ్చే వరకు ఐసొలేషన్‌లో ఉండాలని సూచించాలని డయాగ్నోస్టిక్ సెంటర్లను మంత్రి ఆదేశించారు. కరోనా టెస్టులు ఇంటికొచ్చి చేస్తామని లేదా ఇతర పద్ధతుల్లో మార్కెటింగ్ చేయొద్దని ఈటల కోరారు. విమాన ప్రయాణికులకు కరోనా లక్షణాలు లేకపోయినా టెస్టులు చేసి రిపోర్టు ఇవ్వొచ్చన్నారు.కోవిడ్ పరీక్షలు చేస్తున్న లాబ్ టెక్నీషియన్‌లు పూర్తి స్థాయిలో పీపీఈ కిట్లు వాడేలా చూడాలని ఈటల కోరారు. లేదంటే వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. కరోనా టెస్టుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఆరోగ్య శ్రీ టస్టు భవనంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు.. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
 

Related Posts