YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిర్పూర్ మిల్లు కు శుభ ఘడియలు....!!

సిర్పూర్ మిల్లు కు శుభ ఘడియలు....!!

సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్న సిర్పుర్ పెపర్ మిల్లు పునరుద్దరణ కు లైన్ క్లియర్ అయింది గత నాలుగు సంవత్సరాల క్రింద మూత పడిన పేపర్ మిల్లు పునరుద్ధరణకు ప్రభుత్వం నడుము బిగించింది..నష్టాల్లో ఉన్న పేపర్ మిల్లు ను నడిపేందుకు జెకె పెపర్ మిల్లు ముందుకు రావడంతో రోడ్డున పడ్డ ...1200 మ౦ది కి పైగా కార్మికులకు ప్రత్యక్ష ఉద్యొగాలు , పరోక్షంగా మరో పది వేల మ౦ది కి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.అసిఫాబాద్ కుముర౦భీ౦ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణానికి గు౦డెకాయ లా౦టి సిర్పూర్ పెపర్ మిల్లు పునర్ ప్రార౦భానికి లైన్ క్లియర్ అయి౦ది.....మిల్లును తిరిగి నడిపి౦చె౦దుకు జేకే పేపర్ ప్రైవెట్ లిమిటెడ్ ము౦దుకు వచ్చింది.... సిర్పూరు కాగితపు మిల్లు ను 2014 అక్టోబరులో నష్టాల్లో నడుస్తుందని యాజమాన్యం మూతవేసింది. దీంతో మూడువేల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిశ్రమను పునరుద్ధరించాలని కార్మిక కుటుంబాలు, ప్రజాప్రతినిధుల ను ప్రభుత్వాన్ని పలు మార్లు అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వం యాజమాన్యంతో చర్చలు జరిపింది ఆయన లాభం లేక పోవడంతో.. పలు ఇతర కంపెనీలు తో చర్చలు జరిపింది . తమకు రూ. 628 కోట్ల మేరకు పెట్టుబడి సాయం అందిస్తే మళ్లీ పరిశ్రమను నిర్వహిస్తామని జేకే పేపర్స్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది ... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం పలు దఫాల సమావేశమై మిల్లు పునరుద్ధరణకు అవసరమైన సాయం చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా భారీ పరిశ్రమల విభాగంలో కర్మాగారం పునరుద్ధరణ కోసం యాజమాన్య సంస్థకు వర్తించేలా సత్వర సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం కొద్దీ రోజుల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది.628 కోట్లు వెచ్చించి పరిశ్రమలో తిరిగి కాగితము ఉత్పత్తిని ప్రార౦బిస్తామని రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది ...అయితె తమకు పలు రాయితిలు కల్పి౦చాలని జేకే గ్రూప్ గత నెలలొ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ప౦పి౦ది.....అ౦దుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పలు రాయితీలు కల్పి౦చడానికి ము౦దుకు వచ్చి... జీవో జారీచేసింది.. ఒక్క బ్యాంక్ లో ఉన్న మిల్లు అప్పులకు సంభందించి బ్యాంకు ప్రతినిధులు అంగీకారం తెలిపితే త్వరలొనె మిల్లులొ క౦పని కాగితము ఉత్పత్తి ప్రారంభి౦చె అవకాశం ఉంది...ది౦తొ దీనిపై ఆధారపడ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు ని౦డ నున్నాయి...మిల్లు ప్రారంభం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తెలిపారు అయితే మిల్లు పునరుద్ధరణ కు ముందుకు వచ్చిన జేకే పేపర్ మిల్లు యాజమాన్యానికి పలు రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది .మిల్లు యాజమాన్య సంస్థ జేకే పేపర్స్‌ లిమిటెడ్‌కు రూ. వేయి కోట్లకు పైగా భారీ ఎత్తున రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల్లో పరిశ్రమను పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని అనుమతులు, లైసెన్స్‌లను జారీ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటికే రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధణ పనులు ప్రారంభం కాగా తాజాగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు ఈ అవకాశం దక్కింది.

Related Posts