YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీ ప్రజాప్రతినిధులకు డెయిలీ అపాయింట్ మెంట్

పార్టీ ప్రజాప్రతినిధులకు డెయిలీ అపాయింట్ మెంట్

పార్టీ ప్రజాప్రతినిధులకు డెయిలీ అపాయింట్ మెంట్
విజయవాడ, జూన్ 24
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూట్ మార్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటూ చేపట్టాల్సిన పనులపై చర్చిస్తున్నారట.  పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ నియోజకవర్గాల్లో సమస్యలతో పాటూ అభివృద్ధి పనులపై చర్చించారట. సీఎంను కలిసి తమ నియోజకవర్గాలకు రోడ్లు, ఆస్పత్రులు, మిగిలిన పనులపై హామీ పొందారట.ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ప్రాజెక్టుల పనులు, రోడ్ల విస్తరణ, ఇళ్ల పట్టాలతో పాటూ కీలక అంశాలపై చర్చిస్తున్నారట. ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ ఆయా నియోజకవర్గాల పరిస్థితిపై మాట్లాడారు. బుధవారం కూడా కొందరు ఎమ్మెల్యేలు సీఎంను కలవనున్నారట. ఎంపీలు కూడా త్వరలోనే ముఖ్యమంత్రితో సమావేశంకానున్నారట.పాలనాపరమైన అంశాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు సమయం దొరకడం లేదు. ఇప్పుడు కాస్త సమయం దొరకడంతో ప్రజా ప్రతినిధులకు సమయం కేటాయిస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అంతేకాదు కరోనా ప్రభావం తగ్గిన తర్వాత గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి సీఎం జగన్ రూటు మార్చి ప్రజలకు మరింత దగ్గరయ్యే పనిలో ఉన్నారు. అంతేకాదు ఇటీవల ఓ ఎంపీ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనే వాదనలకు పుల్‌స్టాప్ పెట్టారనే చెప్పాలి.
 

Related Posts