కరోనా ఎఫెక్ట్ తో ఐటీ కారిడార్ వెలవెల
హైద్రాబాద్, జూన్ 24
కళకళలాడే ఐటీ కారిడార్ కరోనా ఎఫెక్ట్ తో వెలవెలబోతోంది. టెకీలు, స్టూడెంట్స్ తో రోజంతా హడావిడిగా ఉండే బిజినెస్ ఏరియాలు లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తర్వాత కూడా కోలుకోవడం లేదు. కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తుండటం, కాలేజీలు తెరుచుకోకపోవడంతో చిరువ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, హాస్టల్ నిర్వాహకులు, హౌస్ కీపింగ్, క్యాంటీన్ వర్కర్లకు ఉపాధి కరువైంది. వేలాది హైరింగ్ వెహికల్స్ షెడ్లకే పరిమితమయ్యాయి. తెల్లవారుజాము మొదలు అర్దరాత్రి దాటినా సాగే ఫుడ్ కోర్టులు మూతపడే ఉంటున్నాయి.ఐటీ కారిడార్ కేంద్రంగా 6 లక్షల మంది ఉద్యోగులు కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ కనీసం 40 మంది ఎంప్లాయీస్ కు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. అందుకోసం 11,980 క్యాబ్‌లు నడుస్తున్నాయి. లాక్డౌన్ మొదలు.. ఇప్పటికీ కంపెనీలు 90 శాతం వర్క్ ఫ్రం హోం ఫాలో అవుతున్నాయి. దాంతో క్యాబ్ లకు పని లేకుండా పోయింది. సాఫ్ట్ వేర్ ఎంప్లాయూస్ ట్రాన్స్ పోర్ట్ కోసం ఇన్నోవా కొన్న 5 నెలలకే లాక్డౌన్ కారణంగా ఉపాధి పోయిందని బోరబండకు చెందిన మహ్మద్ చెప్పాడుకరోనా కారణంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో బిజినెస్ పూర్తిగా పడిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉండే స్ట్రీట్ ఫుడ్ వెహికల్స్ ఇప్పుడు కనిపించడం లేదు. మార్నింగ్ టిఫిన్ నుంచి లేట్ నైట్ బిర్యానీ వరకూ ఘుమఘుమలాడించే ఫుడ్ కోర్టులు తెరుచుకోలేదు. పాన్ ఇండియా థీమ్ తో వెరైటీస్ అందించే 3 వేల మందికి ఉపాధి లేకుండా పోయింది. లాక్డౌన్ రిలాక్సేషన్స్ ఇచ్చాక కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఓపెన్ అవకపోవడంతో ఫుడ్ కోర్టుల కిరాయిలు, కరెంట్ బిల్లులు, హెల్పర్స్ జీత భత్యాలు రోజురోజుకూ భారమవుతున్నాయని అయ్యప్ప సొసైటీ రోడ్డు లోని దోశ ఆన్ వీల్ ఆపరేటర్ సంజయ్ తెలిపాడు. లీజ్ కు తీసుకున్న 4 వెహికల్స్ కు బిజినెస్ లేకున్నా నెలకు రూ.లక్ష చొప్పున 3 నెలల నుంచి కడుతున్నట్లు చెప్పాడు. బండికి ఆరుగురు చొప్పున 25 మంది హెల్పర్లు ఉన్నారని, వారికీ శాలరీస్ ఇస్తున్నానని తెలిపాడు