YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం

 ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం

 ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం
బెంగళూరు జూన్ 24,
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విజయశంకర్ ఆత్మహత్య ఐటీ సిటీలో సంచలనంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య కు పాల్పడదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బెంగళూరులో జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తి స్తున్న ఐఏఎస్ అధికారి విజయశంకర్ ను జువెలరీ కేసు నీడలా వెంటాడింది. ఇప్పుడు ఇదే ఆయన ఆత్మహత్యకు కారణమా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది సస్పెన్స్ గా మారింది.అయితే ఈ కేసులో అధికారి విజయశంకర్ జైలుకి వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే విచారణ కొనసాగుతున్న తరుణంలో ఆయన ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. విజయశంకర్ ఈపేరు అధికారులకు సుపరిచితమే.కానీ జువెలరి కేసు ఆ అధికారిని మనోవేదనకు గురి చేసిందని తెలుస్తోంది.అసలు విషయానికి వస్తే విజయశంకర్ ఐఎంఏ జువెలరీ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.కేసు విచారణ సీరియస్ గా తీసుకున్న అధికారులు అధికారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే ఆయన అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు. అయితే బెంగళూరులోని జయనగరలో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సిటీలో సంచలనంగా మారింది. ఐఎంఏ కేసులో 1.5 కోట్లకు పైగా లంచం తీసుకున్నారనే ఆరోపణల కేసులో గతేడాది జూలై 8వ తేదీన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో పరప్పణ అగ్రహార జైలులో కొన్ని రోజులు జైల్ జీవితం గడిపారు కూడా. అయితే కోర్టు అధికారికి బెయిల్ మంజూరు చెయ్యటంతో విడుదలై య్యారు.కేసు దర్యాప్తులో భాగంగా కొద్ది రోజుల క్రితం విజయశంకర్ నివాసంలో సిట్ అధికారుల తనిఖీ చేసి 2.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ నగదు మొత్తం ఐఎంఏ కేసులో సూత్రధారిగా అవినీతి ఆరోపణల కేసు నేపథ్యం లో ప్రభుత్వం ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.అధికారి చుట్టూ బిగుసుకున్న ఉచ్చుతో ఉక్కిరిబిక్కిరి అయిన అధికారి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది.
బెంగళూరు సిటీలో సంచలనం సృష్టించిన ఐఎంఏ కుంభకోణంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ అధికారులు విచారిస్తున్న తరుణంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.గతంలో బెంగుళూరు సిటీ కలెక్టర్ గా పని చేసిన విజయ్ శంకర్ ... తిలక్ నగర్ పోలీసులు స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ఉంటున్నారు.వీరితో పాటు విజయశంకర్ బార్య, కూతురు కలిసే ఉంటున్నారు. సాయంత్రం వరకు ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపిన ఆయన ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది.విజయ్ శంకర్ ఆత్మహత్య వెనుక ఐఐఎం  కేసులో ఎదుర్కొంటున్న సవాళ్ళే స్పష్టంగా తెలుస్తోంది.కర్ణాటకలో 2019లో జరిగిన ఐఎంఏ స్కాం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఈ స్కామ్లో మరో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని అతనికి క్లీన్ చీట్ ఇవ్వటం , ఆపై  విజయ్ శంకర్ పై సీబీఐ దృష్టి సరిస్తూ వచ్చింది. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం చర్చగా మారింది. భారీ వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి 4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించింది బోర్డ్ తిప్పేసింది. ఇప్పుడు ఈ కేసులోని అధికారి పలు ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు.ఇక అధికారి ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఈ కేసులో ఇంకెవ్వరి ప్రమేయం ఉందో అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.

Related Posts