YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైఎస్ఆర్ కాపు నేస్తం  పేద కాపులకు అభయ హస్తం...

వైఎస్ఆర్ కాపు నేస్తం  పేద కాపులకు అభయ హస్తం...

వైఎస్ఆర్ కాపు నేస్తం  పేద కాపులకు అభయ హస్తం...
పేద కాపు కుటుంబాలకు  తొలివిడతగా  రూ.15 వేలు సాయం... ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు సాయం.
రాయచోటి  జూన్ 24 
వైఎస్ఆర్ కాపు నేస్తం పేద కాపుల అభయ హస్తమని ఎం పి మిథున్ రెడ్డి అన్నారు.బుధవారం  రాయచోటి పట్టణం లోని ఎన్ జి ఓ హోమ్ నందు జరిగిన  రాయచోటి నియోజక వర్గానికి చెందిన     వై ఎస్ ఆర్ కాపు నేస్తం పథకం ప్రారంభ కార్యక్రమంలో ఎం పి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ   బలిజ, కాపు, తెలగ, ఒంటరి కులాలలోని  పేద కుటుంభాలకు    తొలి విడతగా రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతోందన్నారు. ఐదేళ్లలో రూ.75 వేల మొత్తాన్ని అందించడం జరుగుతుందన్నారు.సంక్షేమమే ఊపిరిగా , అభివృద్దే అజెండాగా జగనన్న పాలన జడుగుతోందన్నారు. పాదయాత్రలోను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సుమారుగా అన్ని హామీలను నెరవేర్చడం  జరిగిందన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజలను మోసాగించడంతోనే తగిన బుద్ధి చెప్పారన్నారు. కృష్ణా జలాలను రాయచోటి నియోజక వర్గంలో పారించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు.  వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామన్నారు.గ్రామీణ రహదారులన్నింటినీ అభివృద్ధి పరుస్తామన్నారు.రాయచోటి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా నిలిపేందుకు   చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి  కృషి చేస్తున్నారన్నారు. శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటి రూపురేఖలు మారనున్నాయన్నారు.పేదలందరిలో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.పేదలందరిలో  చిరునవ్వులు చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఎన్ని ఒడిదుడుకులున్నా , రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నా  ఏ మాత్రం అధైర్యపడకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో సీఎం జగన్ నడిపిస్తున్నారన్నారు.ఆమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా అక్క చెల్లెమ్మలుకు సున్నా వడ్డీ, రజకులు, టైలర్లు, నాయీ బ్రహ్మణులు కు ఆర్థిక సహాయం, వాహన మిత్ర, నేతన్న నేస్తం తదితర ఎన్నో సంక్షేమ పథకాలను చెప్పిన సమయం కంటే ముందుగానే అర్హులందరికీ అందిస్తున్నారు. వై ఎస్ ఆర్ కాపు నేస్తం క్రింద రాయచోటి నియోజక వర్గంలో 708 కుటుంబాలు  ఒక కోటి ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు లబ్ది పొందుతున్నారన్నారు. రాయచోటి మున్సిపాలిటీ లో 170, రాయచోటి రూరల్ లో 76, రామాపురం లో 111, లక్కిరెడ్డిపల్లె లో 132, గాలివీడు లో 94, చిన్నమండెం లో 110, సంబేపల్లె మండలం లో 15 కుటుంబాలు లబ్ది పొందుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సహాయాన్ని బ్యాంకుల యందు ఎటువంటి అప్పులకు జమ చేసుకోకుండా లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.  అర్హత  ఉండి కాపు నేస్తం అందని వారికి ప్రభుత్వం  తిరిగి సహాయం అందించే చర్యలు చేపడుతుందన్నారు. జూలై 8 న పేదలందరికీ  ఇంటి పట్టాలు అందివ్వడం జరుగుతుందని, రాయచోటి పట్టణ పరిధిలోనే సుమారు 9 వేల మందికి  ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.చంద్రబాబు పాలనలో కాపులకు అన్యాయం: రాజంపేట ఎం ఎల్ ఏ  మేడా మల్లికార్జున రెడ్డి.చంద్రబాబు పాలనలో కాపులకు అన్యాయం జరిగిందని రాజంపేట ఎం ఎల్ ఏ మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం జగన్ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. జగన్ అధికార పగ్గాలు చేపట్టేనాటికి రాష్ట్రం లో 3 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్నారు. నవరత్నాలును అన్నీ ఏడాదిలోనే అమలుపరచారన్నారు.దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్  మహిళలును ఆదరించారని, అదే స్పూర్తితో  సీఎం జగన్  మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.ఇక 20 ఏళ్లుకు పైగా జగన్ అధికారంలో ఉంటారని మేడా మల్లికార్జున రెడ్డి జోష్యం చెప్పారు. మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి ల చేతుల మీదుగా కాపులకు  మెగా చెక్కు అందచేత. వైఎస్ఆర్ కాపు నేస్తం క్రింద రాయచోటి నియోజక వర్గంలోని 708 కుటుంబాలకు మంజూరైన ఒక కోటి ఆరు లక్షల ఇరవై వేల రూపాయల మెగా చెక్కును  మహిళలకు ఎం పి మిథున్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి ల చేతుల మీదుగా అందచేశారు.జై జగనన్న అంటూ నినదించిన కాపు మహిళలు... వై ఎస్ ఆర్ కాపు నేస్త సమావేశంలో కాపు మహిళలు  జై జగనన్న జోహార్ వై ఎస్ ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. కష్ట కాలంలో తమకు రూ.15 వేలు ఇచ్చి ఆదుకున్నందుకు కాపు పథక లబ్ది దారులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts