YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ దారి కరెక్టు కాదు

జగన్ దారి కరెక్టు కాదు

జగన్ దారి కరెక్టు కాదు
రాజమండ్రి జూన్ 24 
ప్రభుత్వాల తీరుపై తనదైన శైలిలో స్పందించే మాజీ ఎంపి అరుణ్ కుమార్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.ఏడాది పాలనపై స్పందించిన ఉండవల్లి మరోసారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తీరుని, పాలనను ఉండవల్లి తప్పు పట్టారు. సీఎం జగన్ వెళ్తున్న దారి కరెక్ట్ కాదన్నారు.సీఎం జగన్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. దీని వల్ల సీఎం జగన్ కు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఆవ భూముల కొనుగోలు, ఇసుక విక్రయాలు, మద్యం పాలసీ విషయాల్లో సీఎం జగన్ నిర్ణయాలు కరెక్ట్ గా లేవన్నారు ఉండవల్లి.తూర్పుగోదావరి జిల్లా రాజమహేంధ్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ... కరోనా వ్యాప్తి నివారణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉండవల్లి విమర్శించారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడం ఘోరమైన చర్యగా ఉండవల్లి అభిప్రాయపడ్డారు.రాజమండ్రిలో ఆవ భూముల కొనుగోలుపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని,గుర్తు చేసిన ఆయన ... తన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌ని, ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని ఆందోళన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి ఆలోచనా దృష్టి ఎప్పుడూ ప్రజల పైనే ఉండాలి తప్ప.. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం వంటి చర్యలకు స్వస్తి పలకాలని కోరారు.

Related Posts